నిత్యావసర సరకులు, ఎలక్ట్రానిక్స్ సహా వివిధ వస్తువులు విక్రయించే ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. ఆరోగ్య రంగంలోకి (Sastasundar Flipkart) కూడా అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ఆ సంస్థ శుక్రవారం ప్రకటించింది. ఇందుకోసం సస్తాసుందర్ మార్కెట్ ప్లేస్ అనే ఆన్లైన్ ఫార్మసీ సంస్థ నుంచి మెజార్టీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. దీనిపై ఆ సంస్థతో పలు ఒప్పందాలు కూడా చేసుకున్నట్లు (Sastasundar Flipkart) ప్రకటనలో పేర్కొంది. 'ఫ్లిప్‌కార్ట్ హెల్త్ +' పేరుతో త్వరలోనే ఫార్మా సేవలను అందుబాటులోకి తేనున్నట్లు సంస్థ తెలిపింది.
సస్తాసుందర్.కామ్.. డిజిటల్ హెల్త్‌కేర్, ఫార్మసీ రంగానికి సంబంధించి 490 ఫార్మసీల నెట్‌వర్క్‌తో దేశవ్యాప్తంగా (Sastasundar Flipkart) సేవలు అందిస్తోందని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. 'ఫ్లిప్‌కార్ట్ హెల్త్ +', ఇప్పుడు సస్తాసుందర్ సహా ఫ్లిప్‌కార్ట్ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుని ఈ-ఫార్మసీ రంగంలో మెరుగైన సేవలు అందించనుందని సంస్థ పేర్కొంది. భవిష్యత్తులో ఈ-డయాగ్నెస్టిక్స్, ఈ-కన్సల్టేషన్ల సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి : ఆన్లైన్లో గంజాయి సరఫరాపై ప్రధానికి సీఏఐటీ లేఖ