మెరుగైన సరఫరా సేవల కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వినియోగించే దిశగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్.. మహీంద్ర లాజిస్టిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనిలో భాగంగా 2030 నాటికి 25 వేల ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మహీంద్ర లాజిస్టిక్స్ ప్రణాళికలు రచిస్తోంది.
మహీంద్ర గ్రూప్ సంస్థల్లో ఒకటైన మహీంద్ర లాజిస్టిక్స్ ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలతో డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. వివిధ ఈ కామర్స్ సంస్థల భాగస్వామ్యంతో దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో సరఫరా సేవలను అందిస్తోంది. తాజాగా ఫ్లిప్‌కార్ట్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ కూడా ఉత్పత్తి సంస్థల భాగస్వామ్యంతో ద్విచక్ర, మూడు చక్రాల వాహనాలను డెలివరీ కోసం వినియోగిస్తోంది. ప్రస్తుతం కుదుర్చుకున్న ఒప్పందంతో దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను విస్తరించుకోనుంది.
ఇదీ చూడండి: 7 నెలల కనిష్ఠానికి తయారీ రంగ కార్యకలాపాలు!