దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ మరోసారి 'బిగ్ సేవింగ్ డేస్' సేల్‌ను ప్రకటించింది. ఈ నెల 25 నుంచి 29 వరకు ఈ స్పెషల్ సేల్ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ యూజర్లకు ఒక రోజు ముందుగానే (జులై 24) ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
ప్రస్తుతానికి.. సేల్‌లో ఏఏ ఉత్పత్తులపై ఆఫర్లు ఎంత ఉన్నాయనే వివరాలు పూర్తిగా వెల్లడించలేదు ఫ్లిప్‌కార్ట్. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలు, ఈఎంఐలకు 10 శాతం తక్షణ డిస్కౌంట్ లభిస్తుందని మాత్రం స్పష్టం చేసింది.
ఎలక్ట్రానిక్ డివైజ్‌లపై 80 శాతం వరకు, స్మార్ట్ టీవీలపై 75 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్ల సమాచారం.
ఫ్లిప్‌కార్ట్ సేల్ ఆఫర్లు ఇలా..
- పోకో ఎక్స్3 ప్లస్ ధర ప్రస్తుతం 23,999గా ఉంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో ఈ ధర రూ.17,249కి తగ్గనుంది (ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్‌తో కలిపి). 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో పోకో ఎక్స్3 ప్లస్ లభ్యమవనుంది.
- షియోమీ మీ 11 లైట్.. మోడల్ ధరను ఈ సేల్‌లో రూ.23,999 నుంచి రూ.20,499 తగ్గించనుంది ఫ్లిప్‌కార్ట్. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై ఈ డిస్కౌండ్ లభించనుంది.
- యాపిల్ 12 మినీ ధర కూడా భారీగా తగ్గించనున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ప్రస్తుతానికి డిస్కౌంట్ ఎంత అనేది మాత్రం రివీల్ చేయలేదు. ఈ మోడల్ ధర ప్రస్తుతం రూ.77,900గా ఉంది.
- శాంసంగ్ ఎఫ్ 62 మొబైల్ ధరను కూడా రూ.29,999 నుంచి భారీగా తగ్గించే అవకాశం ఉంది.
మరో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కూడా ఇప్పటికే.. 'ప్రైమ్ డే' సేల్ ప్రకటించింది. ఈ నెల 26, 27 మధ్య ఈ సేల్ అందుబాటులో ఉండనుంది.
ఇదీ చదవండి:శాంసంగ్ గెలాక్సీ ఏ22 5జీ.. ఫీచర్స్ లీక్!