కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్(బీహెచ్) సిరీస్(Bharat Series) కింద దేశంలోనే తొలి వాహనం ముంబయిలో రిజిస్టర్(Bharat Series Vehicle Registration) అయింది. మహారాష్ట్ర రవాణా శాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్ మొదటి 'బీహెచ్' నెంబర్ప్లేటు(Bharat Series Number Plate) ఉన్న వాహనాన్ని ఆవిష్కరించారు. ముంబయికి చెందిన శ్రద్ధా సూటే అనే మహిళ పేరుపై ఈ వాహనం రిజిస్టర్ అయింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సమన్వయంతో కేవలం ఎనిమిది రోజుల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవ్వడం విశేషం.
అసలు ఏమిటీ 'భారత్ సిరీస్' ?
కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల, కొన్ని రకాల ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఇతర రాష్ట్రాలకూ బదిలీ అవుతుంటారు. ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. వారు తమ వాహనాలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లాలంటే ఆయా రాష్ట్రాల్లోని నిబంధనల మేరకు జీవితకాలానికి పన్ను(BH Registration Road Tax) చెల్లించాలి. ఆ తరవాత వాహనం తొలుత రిజిస్ట్రేషన్(BH Series Registration) చేయించుకున్న రాష్ట్రంలోని రవాణా శాఖలో పత్రాలు సమర్పిస్తే.. ఆ రాష్ట్రంలో అంతకుముందు చెల్లించిన పన్నుల మొత్తాన్ని(BH Series Registration Cost) తిరిగిస్తారు. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే నెలలు పడుతుంది. రెండు రాష్ట్రాల మధ్య పలు దఫాలుగా తిరగాల్సి వస్తుంది. ఇది వ్యయప్రయాసలతో కూడినది కావటం వల్ల వాహనాల యజమానులు బదిలీ అయిన రాష్ట్రంలో వాహనాల నమోదుకు(Bharat Series Vehicle Registration) ఆసక్తి కనబర్చటం లేదు. ఈ నేపథ్యంలోనే కేంద్రం 'భారత్' విధానాన్ని తీసుకువచ్చింది.
ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకు 'బీహెచ్'(BH Registration) నంబర్ కేటాయిస్తారు. ఈ విధానంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనుకునే వాహన యజమాని పనిచేస్తున్న సంస్థకు కనీసం నాలుగు రాష్ట్రాల్లో కార్యాలయాలు ఉండాలి(BH Registration Rules). ఉద్యోగం చేస్తున్న కార్యాలయ ఉన్నతాధికారి నుంచి తీసుకున్న ధ్రువీకరణ పత్రాన్ని రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాల్సి ఉంటుంది. భారత్ సిరీస్‌లో వాహనాల రిజిస్ట్రేషన్ వ్యవహారాల కోసం 'వాహన్'(BH Series Vahan) పేరిట కేంద్రం ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది.
ఇవీ చదవండి: