ETV Bharat / business

Financial Success: పక్కా ప్రణాళికతోనే ఆర్థిక లక్ష్యం సాకారం..! - financial goals

Financial Success: మనందరికీ కొన్ని ఆర్థిక లక్ష్యాలుంటాయి. వీటిని సాధించేందుకు ఎన్నో ఏళ్లుగా కష్టపడుతుంటాం. వ్యక్తులను బట్టి, ఈ లక్ష్యాలూ మారుతుంటాయి. అందరూ తాము ఆర్థికంగా విజయం, స్వేచ్ఛ సాధించాలనే కోరికతోనే ఉంటారు. కరోనా మహమ్మారి, ఇతర అనిశ్చితులతో ఎంతోమంది తమ దీర్ఘకాలిక లక్ష్యాల విషయంలో సర్దుకుపోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ ప్రణాళిక గాడిన పడాలంటే కొన్ని విషయాలపై శ్రద్ధ చూపించాల్సిందే.

Financial success
ప్రణాళికతోనే ఆర్థిక విజయం సాధ్యం
author img

By

Published : Mar 18, 2022, 2:52 PM IST

Financial Success: ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే దానికి ఒక కచ్చితమైన వ్యూహం, ప్రణాళిక ఉండాలి. ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం.. ఎక్కడికి చేరుకోవాలి. ఎంత కాలం పడుతుంది. ఇలాంటివన్నీ అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం మీకున్న ఆర్థిక స్తోమత గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. సాధించాల్సిన లక్ష్యాలను ఒక క్రమ పద్ధతిలో రాసి పెట్టుకోండి. దీనికి కావాల్సిన మొత్తం ఎంత అనేది అంచనా వేసుకోండి. ఆ మొత్తాన్ని పోగు చేయడానికి ఎంత కాలం పడుతుంది.. పెట్టుబడి కోసం డబ్బును ఎలా కేటాయిస్తారు.. ఇలా ప్రతి అంశమూ పరిశీలించండి. మీ ప్రణాళిక సవివరంగా ఉన్నప్పుడే.. మీ లక్ష్య సాధన ప్రయాణం తేలిక అవుతుందని గుర్తుంచుకోండి.

క్రమశిక్షణతో..

ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుంటే సగం పని అయిపోయినట్లే. మిగతా పని దానిని ఆచరణలో పెట్టినప్పుడే పూర్తవుతుంది. క్రమశిక్షణతో పొదుపు, పెట్టుబడులు పెట్టాలి. దీర్ఘకాలంలో సంపద సృష్టించాలంటే.. ఎంత మొత్తం పెట్టుబడి పెట్టామన్నదానికన్నా.. ఎలా పెట్టుబడులు పెట్టామన్నదే ముఖ్యం. చిన్న మొత్తమైనా క్రమం తప్పకుండా మదుపు చేసినప్పుడే మంచి లాభాలను ఆర్జిస్తుంది.

ఉదాహరణకు నెలకు రూ.5వేల చొప్పున 10 ఏళ్లపాటు మదుపు చేశారనుకుందాం. కనీసం 12% వార్షిక రాబడితో మీ మొత్తం పెట్టుబడి రూ.6లక్షలు.. రూ.11.6లక్షలుగా మారుతుంది. అంటే దాదాపు రెట్టింపు అన్నమాట. క్రమం తప్పకుండా మదుపు చేసినప్పుడే ఇలాంటి ఫలితాలు ఉంటాయన్నది మర్చిపోవద్దు.

అప్పులు ఆచితూచి..

అప్పు చేయడం తప్పు కాకపోవచ్చు. కొన్ని రుణాలు మన నికర విలువనూ పెంచేందుకూ, ఆదాయాన్ని ఆర్జించేందుకూ ఉపయోగపడతాయి. ఆర్థిక స్వేచ్ఛ సాధనలో కొన్నిసార్లు రుణాలూ కీలకమే. వ్యాపారం కోసం చేసే అప్పు, ఇంటి కోసం తీసుకున్న రుణం మంచివే. మరోవైపు క్రెడిట్‌ కార్డుతో చేసే ఖర్చులు, వ్యక్తిగత రుణాలు అధిక వడ్డీని వసూలు చేయడమే కాకుండా.. మన సంపాదనను హరించి వేస్తాయి. అప్పు చేయడం తప్పదు అనుకున్నప్పుడు.. ఏ రుణం తీసుకోవాలన్నదీ చూసుకోవాలి. వడ్డీ రేట్లు తక్కువగా ఉన్న చోట రుణం తీసుకోవాలి. ఒకసారి రుణం తీసుకున్నామంటే.. దాన్ని వీలైనంత తొందరగా తీర్చేందుకు ప్రయత్నించాలి.

ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా..

సురక్షిత, స్వల్పకాలిక పట్టుబడి పథకాల వల్ల కొన్ని లక్ష్యాలు సాధించవచ్చు. దీర్ఘకాలంలో ఆర్థిక విజయం సాధించాలంటే ఇవి సరిపోవు. పెట్టుబడులు ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా ఉండాలి. 2000-2018 మధ్య కాలాన్ని పరిశీలిస్తే.. కుటుంబ నిర్వహణ ఖర్చులు సగటున దాదాపు 9.5శాతం పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు ఇవి మరింత పెరిగాయి. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 11.4 శాతం రాబడినిచ్చింది. అంటే ద్రవ్యోల్బణాన్ని అధిగమించింది. దీర్ఘకాలంలో ఈక్విటీ మార్కెట్‌ ద్వారానే ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి ఆర్జించేందుకు వీలవుతుందని చెప్పొచ్చు. కాబట్టి, నష్టభయం ఉంటుందని వీటిని దూరంగా ఉంచడం సరికాదు.

డబ్బు సంపాదించడం కన్నా దాన్ని నిర్వహించడమే కష్టం. మీరు ఇప్పుడిప్పుడే సంపాదన ప్రారంభిస్తే, మీ లక్ష్య సాధనకు ఆ మొత్తాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందుబాటులో ఉన్న సమాచారంతో పూర్తి అవగాహన పెంచుకోవాలి. దీనికోసం నమ్మకమైన వార్తా పత్రికలు, వెబ్‌సైట్లలో ఉండే వ్యక్తిగత ఆర్థిక సలహాలను గమనిస్తూ ఉండాలి. స్టాక్‌ మార్కెట్లో ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులు, అందుబాటులో ఉన్న పథకాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే మీ లక్ష్యాలను సాధించేందుకు మార్గం దొరుకుతుంది.

- బి.గోప్‌కుమార్‌, ఎండీ-సీఈఓ, యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

ఇదీ చదవండి: క్రెడిట్​ కార్డు.. విదేశీ ప్రయాణాల్లో మనకు తోడుగా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.