ETV Bharat / business

ఈఎంఐలు భారంగా మారాయా? అయితే ఇది మీకోసమే.. - నెలవారీ వాయిదాల నిర్వహణలో జాగ్రత్తలు

అవసరాలు పెరగడం.. సులభంగా అప్పు లభిస్తుండటం వల్ల ఎంతోమంది రకరకాల అప్పులను తీసుకుంటున్నారు. అనుకోకుండా.. ఆదాయం తగ్గడం లేదా ఇతర అవసరాలు వచ్చినప్పుడు.. ఆ రుణాల ఈఎంఐలు చెల్లించలేక ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులు రాకుండా.. రుణాల నిర్వహణ విషయంలో ఓ ప్రణాళిక అవసరం. మరి ఆ ప్రణాళిక ఎలా ఉండాలి? అనే విషయంపై నిపుణులు చెబుతున్న సూచనలు మీ కోసం.

EMI Planning tips
ఈఎంఐల చెల్లింపులకు టిప్స్​
author img

By

Published : Oct 8, 2021, 12:52 PM IST

ఒక రుణాన్ని ముందే తీర్చేయడం వల్ల వడ్డీ రూపంలో మనకు పెద్ద మొత్తంలో మిగులు కనిపిస్తుంది. ముఖ్యంగా రుణం తీసుకున్న తొలినాళ్లలోనే దాన్ని ముగించేస్తే.. మరింత ప్రయోజనం ఉంటుంది. కాసింత మిగులు మొత్తం ఉన్నవారు.. రుణాల ప్రాధన్య క్రమాన్ని రూపొందించుకోవాలి. రెండు మూడు అప్పులున్నప్పుడు అధిక వడ్డీ వసూలు చేస్తున్న రుణాన్ని ముందస్తుగా చెల్లించేందుకు ప్రయత్నించాలి. ఇలా ముందుగానే చెల్లించేటప్పుడు బ్యాంకులు విధించే రుసుములనూ చూసుకోవాలి. స్థిర వడ్డీ రేటుకు తీసుకున్న రుణాలపై ముందస్తు చెల్లింపు రుసుములను వసూలు చేస్తాయి బ్యాంకులు. అయితే, చలన వడ్డీ రేటు రుణాలపై ముందుస్తు చెల్లింపు ఛార్జీలు ఉండవు.

మీరు చెల్లిస్తున్న రుసుములకన్నా.. వడ్డీ భారం అధికంగా ఉన్నప్పుడే రుణాన్ని ముందుగా తీర్చేందుకు ప్రయత్నించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అత్యవసర నిధిని రుణ వాయిదాల చెల్లింపు కోసం వాడుకోకూడదు. పెట్టుబడులను వెనక్కి తీసుకుని, రుణాన్ని చెల్లించాలి అనుకున్నప్పుడు.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్లలాంటి వాటిని రద్దు చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సురక్షిత పథకాలు.. మనం చెల్లిస్తున్న వడ్డీ కన్నా తక్కువ రాబడినే అందిస్తున్నాయి.

బదిలీ చేసుకోవచ్చు..

అధిక వడ్డీ రేటు ఉన్న బ్యాంకు నుంచి తక్కువ వడ్డీ రేటు ఉన్న బ్యాంకుకు మీ రుణాన్ని మార్చుకునే వెసులుబాటు ఉంది. దీన్నే బ్యాలెన్స్‌డ్ ట్రాన్స్‌ఫర్‌ అంటారు. దీనివల్ల రుణగ్రహీతకు వడ్డీతోపాటు, ఈఎంఐ భారమూ తగ్గుతుంది. దీర్ఘకాల వ్యవధి ఉన్నప్పుడు.. ప్రస్తుతం రుణం తీసుకున్న బ్యాంకు, కొత్త బ్యాంకు వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవాలి. క్రెడిట్‌ స్కోరు, ఆదాయం, చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి, వడ్డీలో మార్పులు ఉంటాయి.

మరో బ్యాంకు మీకు తక్కువ రేటుకే రుణం ఇస్తానని చెప్పినప్పుడు.. పాత బ్యాంకును వడ్డీ రేటు తగ్గించాల్సిందిగా అడగవచ్చు. అంగీకరించకపోతే.. మరో బ్యాంకుకు ఆ బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. ముందస్తు చెల్లింపు రుసుములు, పరిశీలనా ఫీజులు, ఇతర ఛార్జీలను రెండు బ్యాంకుల్లో కలిపి ఎంత అవుతుందనేదీ తెలుసుకోవాలి. ఇవన్నీ కలిపినప్పుడు.. రుణాన్ని మార్పిడితో పోలిస్తే చాలా తక్కువగా ఉండాలి. అప్పుడే రుణాన్ని మార్చుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. లేకపోతే నష్టమే.

క్రెడిట్‌ నివేదిక చూసుకోవాలి..

మీ రుణ వాయిదాలు, క్రెడిట్‌ కార్డుల బిల్లుల చెల్లింపు ఎప్పటికప్పుడు సరిగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. దీనికోసం క్రెడిట్‌ నివేదికలను పరిశీలిస్తూ ఉండాలి. ఇందులో మీ రుణాల వివరాలు, కార్డు ఖాతాలు, ఇప్పటి వరకూ మీరు దరఖాస్తు చేసిన రుణ వివరాలు తదితరాలన్నీ ఉంటాయి. మీకు తెలియకుండానే ఏమైనా రుణాలను నమోదైనా.. కార్డు బిల్లులు చెల్లించినప్పటికీ.. చెల్లించలేదని పడినా.. వెంటనే క్రెడిట్‌ బ్యూరోల దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్లాలి. లేకపోతే.. మీ క్రెడిట్‌ స్కోరు తగ్గడం, అవసరమైనప్పుడు రుణాలను తీసుకోవడంలో ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది.

- గౌరవ్‌ అగర్వాల్‌, సీనియర్‌ డైరెక్టర్‌, పైసాబజార్‌

ఇదీ చదవండి: రూ.5 లక్షల్లో కొత్త కార్​ కొనాలా? ఇవి చూడండి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.