ETV Bharat / business

కొత్తగా పెళ్లయిందా? బీమా, లోన్ విషయంలో ఇలా చేస్తే లాభాలెన్నో!

author img

By

Published : Feb 11, 2022, 2:45 PM IST

New couple financial planning: ప్రేమ.. రెండు మనుసులను ఒక్కటిగా చేస్తుంది. ఎవరికి వారే అన్నట్లు ఉండేవారుకూడా.. ప్రేమలో పడిన తర్వాత ఒకరికి ఒకరుగా జీవిస్తారు. ఎన్నో కలలుకంటారు. ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరాలని.. జీవితంలో ఎన్నో అనుభూతులను పొందాలని భావిస్తారు. ప్రేమ సంగతి ఎలా ఉన్నా.. ఇవన్నీ సిద్ధించాలంటే.. ఆర్థికంగా ఎలా అడుగులు వేయాలో తెలుసుకోవాలి.

Financial Financial PlanningPlanning
Financial PlanFinancial Planningning

New couple financial planning: ఫిబ్రవరిలో తక్కువ రోజులే ఉంటాయి. కానీ, ప్రేమ భావనను చాటడం ఈ నెల ప్రత్యేకం. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం ఉన్నప్పటికీ నెలంతా దాని ప్రభావం ఉంటుంది. మనసుతో ముడిపడిన ప్రేమ సంగతి ఎలా ఉన్నా.. ఒకరికి ఒకరు తోడునీడగా నిలిచి, ఆర్థిక ప్రేమనూ చాటుకోవాల్సిన తరుణమిది. అప్పుడే కుటుంబ భవిష్యత్తుకూ ఒక భరోసా ఏర్పడుతుంది. అందుకే, ప్రేమికులుగా ఉన్నా.. దంపతులైనా.. కచ్చితమైన ఆర్థిక ప్రణాళికలు ఉండాల్సిందే. అందుకోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

కలలు.. ఉమ్మడిగా..

జంటగా మారిన తర్వాత సాధించాల్సిన మొదటి ఆర్థిక లక్ష్యం ఏమిటి? నిర్ణయించుకోండి. ఒకరి ఆర్థిక ఆలోచనలు మరొకరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఉమ్మడిగా ఒక నిర్ణయానికి రండి. దానిని సాధించేందుకు ఏ మార్గాన్ని ఎంచుకోవాలన్నది తెలుసుకోండి. మనం ఇక్కడ యువ జంటల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, వారికి పెట్టుబడులు పెట్టి, దీర్ఘకాలం కొనసాగే వెసులుబాటు ఉంటుంది. ఫలితంగా పెద్ద మొత్తంలో నిధిని సమకూర్చుకునేందుకూ అవకాశం ఉంటుంది.

నిజం చేసుకునేలా..

ఒక ఆర్థిక కలను లేదా లక్ష్యాన్ని చేరుకునే దశలో.. దాని కోసం ఎవరు ఎంత మేరకు కృషి చేస్తున్నారన్నదీ ముఖ్యమే. ఒక లక్ష్యాన్ని సాధించేందుకు ఎంత వ్యవధి ఉంది.. అది స్వల్పకాలిక లక్ష్యమా.. దీర్ఘకాలికమా.. అనేది ముందుగా గుర్తించాలి. రానున్న రోజుల్లోనూ ఇద్దరూ ఆర్జిస్తారు అనుకుంటే.. ఉమ్మడి లక్ష్యాన్ని సాధించడం తేలికే. ఇలా కాకుండా.. ఒకరే ఉద్యోగం చేస్తారు.. మరొకరు కుటుంబ నిర్వహణ బాధ్యతలను చూస్తారు అనుకుంటే.. ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాలి. లక్ష్యాన్ని అనుకోవడంతోనే సరిపోదు. దాన్ని నిజం చేసుకునే దశలో కొన్ని త్యాగాలూ అవసరం అవుతాయి. ఆర్జించిన మొత్తంలో నుంచి ఇద్దరూ ముందుగా పొదుపు చేసి, ఆ తర్వాతే ఖర్చు చేయడం నేర్చుకోవాలి. కుటుంబంలో ఒక్కరే ఆర్జిస్తున్నా.. సరైన ప్రణాళిక, జీవిత భాగస్వామి సహకారంతో పెద్ద లక్ష్యాలనూ సులభంగా సాధించేందుకు అవకాశం ఉంటుందని మర్చిపోవద్దు. సరైన సమయంలో.. సరైన పెట్టుబడి విధానం పాటించేందుకు ప్రయత్నించాలి.

రుణాలకు దూరం

అప్పు చేయడం తప్పు కాకపోవచ్చు. కానీ, దాని అవసరం ఎంత అన్నది ఇక్కడ ప్రధానం. అవసరం లేని వస్తువులను కొనేందుకు అప్పు చేస్తే.. అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుందనే సూత్రాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. రుణం తీసుకున్నా.. తక్కువ వడ్డీ ఉండేలా చూసుకోవాలి. విలువ పెరిగే వాటి కోసమే అప్పు చేయాలి. ఇంటి రుణంలాంటివి ఇందుకు ఉదాహరణ. జంటగా ఇంటి రుణం తీసుకుంటే.. పన్ను ఆదా చేసుకునేందుకూ ఉపయోగపడుతుంది.

బీమా.. ధీమా...

కుటుంబంలో ఆదాయం ఆర్జించే వ్యక్తి పేరిట తప్పనిసరిగా బీమా పాలసీ ఉండాల్సిందే. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కుటుంబానికి ఇదే ఆర్థికంగా అండగా నిలుస్తుంది. పిల్లల చదువుల కోసం బీమా పాలసీని పొదుపు పథకంగానూ ఉపయోగించుకోవచ్చు. జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఎప్పుడూ కాదనలేని అవసరం. దంపతులుగా మారిన వెంటనే.. ఉమ్మడిగా ఫ్యామిలీ ఫ్లోటర్‌ హెల్త్‌ పాలసీని తీసుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి.

వ్యూహాత్మకంగా..

ఒకరికి ఒకరు మీరు తోడునీడగా.. ధైర్యంగా ఉన్నట్లే.. మీ పెట్టుబడులూ మీ కోసం అలాగే ఉండాలి. ప్రతి మదుపు పథకం గురించి ఇద్దరూ తెలుసుకోండి. దాన్ని అర్థం చేసుకోండి. పూర్తి అవగాహనతో మదుపు చేయండి. పన్నుల భారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. పెట్టుబడులు వైవిధ్యంగా ఉండాలి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోవడానికి మొహమాటపడొద్దు.

రేపటి కోసం..

జీవితంలోని ఒక్కో దశలో ఏం సాధించాలన్నది కల. ఆ కలను నిజం చేసుకునేందుకు ప్రతిక్షణం ఆరాటపడటం బాధ్యత. మీ కష్టార్జితానికి రక్షణ ఇవ్వడంతోపాటు, పెట్టుబడి వృద్ధికి దోహదపడే పథకాలు పరిశీలించాలి. మీ వయసు, నష్టభయం భరించే సామర్థ్యం ఇక్కడ కీలకం. తొలినాళ్లలో అధిక నష్టభయం ఉన్నా.. రాబడి ఎక్కువగా అందించే పథకాలు ఎంచుకోవాలి. కాలం గడుస్తున్న కొద్దీ.. పెట్టుబడికి రక్షణ ఇచ్చే వాటికి మారాలి.

ఆర్థిక ప్రణాళిక ఒక ప్రయాణంలాంటిది. ఇది ఒక రోజుతో ముగిసేది కాదు. ప్రేమికుల రోజున మీ కబుర్లలో ఆర్థిక విషయాలకూ కాస్త సమయం కేటాయించండి. భవిష్యత్తులో ఎదురయ్యే ఎన్నో అడ్డంకులను అధిగమించేందుకు మానసికంగా బలోపేతం అవుతారు. నిండు నూరేళ్ల జీవితానికి ఆర్థిక విజయోస్తు!

రచయిత- వికాస్‌ సింఘానియా, సీఈఓ, ట్రేడ్‌స్మార్ట్‌

ఇదీ చూడండి: 'ఆర్థిక వ్యవస్థ కుదేలైనా.. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేశాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.