ETV Bharat / business

'18-45 ఏళ్ల వారికి టీకా వేయాలి' - ఉదయ్​ శంకర్,

దేశంలో కొవిడ్​ కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడాన్ని మరింతగా వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరింది ఫిక్కీ. 18-45 ఏళ్ల వారికి టీకా వేయడాన్ని ప్రారంభించాలని కోరుతూ.. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖకు లేఖ రాసింది.

FICCI
ఫిక్కీ లేఖ
author img

By

Published : Apr 4, 2021, 5:03 AM IST

దేశవ్యాప్తంగా కొవిడ్​-19 పరీక్షలు నిర్వహించడాన్ని మరింతగా వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని ఫిక్కీ కోరింది. అలాగే 18-45 ఏళ్ల వారికి టీకా వేయడాన్ని ప్రారంభించాలని విజ్ఞప్తి చేసింది. కొవిడ్​-19 మహమ్మారితో ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో పూర్తి మద్దతును పరిశ్రమ అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపింది.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంరక్షణ శాఖ మంత్రి హర్ష వర్ధన్​కు లేఖ రాశారు ఫిక్కీ అధ్యక్షుడు ఉదయ్​ శంకర్​.

'జనవరిలో రోజుకు 5 లక్షల శ్యాంపిల్స్​ను పరీక్షించే స్థాయికి మనం చేరినప్పటికీ.. ప్రస్తుతం రోజుకు దాదాపు 11 లక్షల శ్యాంపిల్స్​ను మాత్రమే పరీక్షిస్తున్నాం. అయితే.. మరిన్ని పరీక్షలను నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా 2,440 ల్యాబ్​లు అందుబాటులో ఉన్నాయి, ఇందులో 1,200 వరకు ప్రైవేట్​ రంగానికి చెందినవి'

- ఉదయ్​ శంకర్, ఫిక్కీ అధ్యక్షుడు

నిర్దేశిత పరీక్షల సామర్థ్య లక్ష్యాన్ని అందుకునేందుకు ప్రైవేటు రంగంలోని ఈ ల్యాబ్​లను ఉపయోగించుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించవచ్చని లేఖలో తెలిపారు ఉదయ్​ శంకర్​. ప్రస్తుతం టీకాలకు కొరత లేకపోవడం, ప్రైవేటు రంగం కూడా పూర్తిస్థాయిలో పాల్గొంటున్నందున 18-45 ఏళ్ల వయస్సు వాళ్లకూ టీకా వేసే ప్రక్రియను ప్రారంభించాలని కోరారు. కొవిడ్​-19 వ్యాప్తికి ఈ వయసు వాళ్లే ఎక్కువ కారకులుగా మారుతుండటమే ఇందుకు కారణంగా వెల్లడించారు.

ఇదీ చూడండి: తయారీ రంగం కోలుకుంటోంది: ఫిక్కీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.