ETV Bharat / business

అంకురాలకు పండుగ కలిసొచ్చేనా?

author img

By

Published : Oct 23, 2020, 9:37 AM IST

దసరా, దీపావళి పండుగ వేళ వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలో ప్రజలు ఎక్కువగా కొనుగోళ్లు చేస్తుంటారు. అంతేకాకుండా ప్రయాణాలు ఎక్కువే ఉంటాయి. లాక్​డౌన్ తర్వాత ప్రస్తుతం పండుగ వస్తోంది. పండుగ సమయంలో అంకురాలు లబ్ధిపొందనున్నాయని అంకుర ప్రతినిధులు చెబుతున్నారు.

festivals effect on startup companies in india
అంకురాలకు పండుగ కలిసొచ్చేనా?

లాక్​డౌన్​తో కొనుగోళ్లు ఆగిపోయాయి. ప్రజలు నిత్యావసరాలు మినహా మిగతా వాటిపై ఖర్చు పెట్టలేదు. పండుగలు రావడం వల్ల ఇటీవలే కొనుగోళ్లు పెరుగుతున్నాయి. పండుగల సందర్భంగా ఈ కామర్స్ కంపెనీలు భారీ స్థాయిలో సేల్స్ చేపడుతున్నాయి. దీనికోసం ఆఫర్లను ప్రకటించాయి. అమెజాన్​లో ఇన్నోవేటీవ్​గా ఉన్న ఉత్పత్తులు, ఆవిష్కరణ స్థాయిలో ఉన్న మంచి ఉత్పత్తుల కోసం లాంచ్ ప్యాడ్ పేరిట ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వీటిలో ఉన్న ఉత్పత్తులపై కమీషన్​ను తక్కువగా తీసుకుంటుంది. అమెజాన్ లాంచ్ ప్యాడ్​లో ఉన్న అంకురాల్లో కూడా పెట్టుబడులు పెట్టేందుకు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతారని ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్స్, తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్​ జాయింట్ సెక్రటరీ రవితేజ గుప్తా తెలిపారు.

ఆన్​లైన్​లో కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు

ప్రస్తుతం పరిస్థితుల్లో ఆఫ్​లైన్​లో షాపింగ్ చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. ఆన్​లైన్​లో కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం అంకురాలకు సంబంధించి పరిస్థితి సాధారణంగా ఉందని అంకురాల ప్రతినిధులు చెబుతున్నారు. లాక్​డౌన్ కొన్ని అంకురాలకు అనుకూలంగా ఉండగా, కొన్నింటిపై ప్రతికూలంగా ప్రభావం చూపినప్పటికీ.. పరిస్థితిని బట్టి మంచి ఫలితాలను సాధిస్తున్నాయని తెలిపారు. పెద్ద పెద్ద కంపెనీలే మార్కెట్​కు అనుగుణంగా మారుతున్నప్పుడు, చిన్న అంకురాలు రోజు వారీగా మారాల్సిన పరిస్థితి ఉంటుందని వారు సూచిస్తున్నారు.

పరిస్థితిని బట్టి మారుతుండాలి

ప్రస్తుతం అన్​లాన్ కొనసాగుతున్నందున.. మున్ముఁదు పరిస్థితులు మెరుగవుతాయని వారు చెబుతున్నారు. అంకురాలు చిన్న టీమ్ ఉండడం వల్ల నిర్ణయం త్వరగా తీసుకోవచ్చు. పెద్ద కంపెనీలు నిర్ణయం తీసుకోవాలంటే సమయం పడుతుంది. ఒక్కో సారి నిర్ణయం తీసుకునే వరకే మార్కెట్ మారిపోయే పరిస్థితి ఉంటుంది. స్విగ్గీ ఒకప్పుడు కేవలం ఆహారం మాత్రమే డెలివరీ చేసేది. ఇప్పుడు చాలా వాటిని డెలివరీ చేస్తోంది. డన్జో లాంటి అంకురంలో గూగుల్ లాంటి ప్రముఖ కంపెనీ పెట్టుబడి పెట్టింది. ఊబర్ హైదరాబాద్ మెట్రోతో ఒప్పందం చేసుకుంది. బైక్ రైడింగ్​లో ఉండే ర్యాపిడో ఇప్పుడు ఆటోలోకి ప్రవేశించింది. ఇలా పరిస్థితిని బట్టి మారుతుండాలి. లేని పక్షంలో అంకురం మూసివేసే పరిస్థితి ఉంటుందని రవితేజ గుప్తా చెప్పారు.

ఇదీ చూడండి: పబ్‌జీ మళ్లీ వచ్చేస్తోంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.