ETV Bharat / business

పండగ సమయంలో కొలువుల జాతర - కొలువుల జాతర

ఇ-కామర్స్‌ రంగంలో భారీ ఎత్తున తాత్కాలిక నియామకాలు జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా వినియోగదారు సెంటిమెంటు, గిరాకీ పెరగడం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలోనే అక్టోబరు-డిసెంబరులో తాత్కాలిక సిబ్బంది నియామకాల్లో 400 శాతం వృద్ధి కనిపిస్తోందని క్వెస్‌ కార్ప్‌ అనుబంధ సంస్థ టాస్క్‌మో తెలిపింది.

job
కొలువుల జాతర
author img

By

Published : Oct 22, 2021, 7:56 AM IST

పండగల సీజను నేపథ్యంలో పలు రంగాల్లో ముఖ్యంగా ఇ-కామర్స్‌ రంగంలో భారీ ఎత్తున తాత్కాలిక నియామకాలు జరుగుతున్నాయి. వినియోగదారు సెంటిమెంటు, గిరాకీ పెరగడం ఇందుకు కారణం. ఇదేవిధంగా స్మార్ట్‌ ఫోన్ల అమ్మకాలు కూడా ఎన్నడూ లేనంత అధిక స్థాయిలో 760 కోట్ల డాలర్ల (సుమారు రూ.57,000 కోట్ల)స్థాయిలో జరగొచ్చని మార్కెట్‌ పరిశోధనా సంస్థ కౌంటర్‌ పాయింట్‌ పేర్కొంది.
'అక్టోబరు-డిసెంబరులో తాత్కాలిక సిబ్బంది (గిగ్‌ వర్కర్స్‌) నియామకాల్లో 400 శాతం వృద్ధి కనిపిస్తోంద'ని క్వెస్‌ కార్ప్‌ అనుబంధ సంస్థ టాస్క్‌మో సహ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ జనాద్రి పేర్కొన్నారు. తాత్కాలిక, స్వల్పకాలిక సిబ్బందికి ఎక్కువ గిరాకీ లభిస్తోందని వివరించారు. జూన్‌, సెప్టెంబరు త్రైమాసికాలతో పోలిస్తే వీరికి వేతనాలు 1.25-1.5 రెట్లు అధికంగా లభిస్తున్నాయి. ఇ-కామర్స్‌ రంగంలోనే లక్ష మందికి పైగా ఉపాధి లభిస్తోందని ఫస్ట్‌మెరిడియన్‌ బిజినెస్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ సీఈఓ సుధాకర్‌ అంటున్నారు.

  • ఇ-కామర్స్‌లో 50%; ఇ-ఫార్మా, లాజిస్టిక్స్‌లో 30-40%, ఆహార డెలివరీలో 50% పైగా నియామకాలు చోటు చేసుకుంటున్నాయని అంచనా.
  • తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకల్లో బ్లూ కాలర్‌ సిబ్బందికి 50% మేర గిరాకీ పెరిగింది. దిల్లీ, ముంబయి, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, కోల్‌కతా, పుణె, లఖ్‌నవూలలో ఎక్కువ నియామకాలు జరుగుతున్నాయి.

వ్యక్తిగత అవసరాలకే వెచ్చిస్తున్నారు

తాము పొదుపు చేసుకున్న మొత్తం నుంచి, తమకు కావాల్సిన ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకే అధికులు ప్రాధాన్యమిస్తున్నారని కౌంటర్‌పాయింట్‌ వివరించింది. స్మార్ట్‌ఫోన్‌ సగటు విక్రయ ధర కూడా ఎన్నడూ లేనంతగా 14 శాతం అధికమై 230 డాలర్ల (సుమారు రూ.17,200)కు చేరొచ్చన్నది అంచనా. మధ్య, ప్రీమియం శ్రేణి స్మార్ట్‌ఫోన్లను కంపెనీలు అధికంగా ప్రచారం చేస్తున్నాయని సులభ వాయిదాల్లో లభించడమూ కలిసి వస్తోందని చెబుతున్నారు. చిప్‌సెట్‌ కొరత వల్ల అందుబాటు ధర స్మార్ట్‌ఫోన్ల లభ్యత తగ్గుతోంది.

ఇదీ చూడండి: Amazon Prime: అమెజాన్​ ప్రైమ్​ యూజర్లకు బ్యాడ్​ న్యూస్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.