ETV Bharat / business

టోల్​ ఫీజుల్లో రాయితీలకు ఫాస్టాగ్ తప్పనిసరి - fastag benefits

జాతీయ రహదారులపై ఫాస్టాగ్​ ఉంటేనే టోల్​ ఫీజుల్లో రాయితీలు లభిస్తాయని కేంద్ర రవాణా శాఖ వెల్లడించింది. ఈ మేరకు నిబంధనలను సవరించి గెజిట్​ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫలితంగా చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్​ ఉన్నవారికే మినహాయింపులు వర్తిస్తాయి.

FASTag
ఫాస్టాగ్
author img

By

Published : Aug 26, 2020, 9:28 PM IST

జాతీయ రహదారులపై టోల్​ ప్లాజాల్లో రాయితీలు పొందడానికి ఫాస్టాగ్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గెజిట్​ నోటిఫికేషన్​ విడుదల చేసింది కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ.

"టోల్​ ప్లాజాల్లో తిరుగు ప్రయాణంపై రాయితీ, ఇతర మినహాయింపులు పొందాలంటే ఫాస్టాగ్ తప్పనిసరి. 24 గంటల్లోపు తిరిగి వచ్చేవారు, స్థానికులు కోరే మినహాయింపులు.. చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్​ ఉన్నవారికే వర్తిస్తాయి. టోల్​ప్లాజాల్లో డిజిటల్​ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం."

- కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ

ఇందుకు సంబంధించి జాతీయ రహదారుల రుసుము నిబంధనలు-2008లో నిబంధనలు చేసినట్లు రవాణా శాఖ వెల్లడించింది. తిరుగు ప్రయాణంపై రాయితీ పొందేవారు ఎలాంటి పాసులు చూపించనక్కరలేదని, ఆటోమేటిక్​గా రాయితీ అందుతుందని తెలిపింది.

ఫాస్టాగ్​..

వాహనదారులకు ట్రాఫిక్​, నగదు సమస్యల వంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఎన్‌ఈటీసీ) కార్యక్రమానికి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 2014లో పైలట్‌ ప్రాజెక్టుగా ఫాస్టాగ్‌ను ప్రారంభించారు. డిసెంబర్​ 15 నుంచి తప్పనిసరి చేసింది కేంద్రం.

ఇదీ చూడండి: భర్త సొమ్ముపై మొదటి భార్యకే అర్హత: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.