ETV Bharat / business

మే 31 వరకు బీఎస్​-4 వాహనాల విక్రయం?

ప్రభుత్వం నిర్దేశించినట్లుగా ఈ నెలాఖరులోగా బీఎస్​-4 వాహనాల స్టాక్​ను విక్రయించలేమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్ స్పష్టం చేసింది. వాటిని అమ్మేందుకు మే 31 వరకు గడువు పెంచాలని సుప్రీంలో పిటిషన్​ వేసింది. కరోనా నేపథ్యంలో అమ్మకాలు సాగడం లేదని పేర్కొంది. ఈ అంశంపై అత్యవసర విచారణ చేపట్టాలని న్యాయస్థానాన్ని కోరింది.

fada approaches sc
సుప్రీంలో ఫాడా పిటిషన్​
author img

By

Published : Mar 17, 2020, 6:13 PM IST

భారత్ స్టేజ్ (బీఎస్​)-4 వాహనాల విక్రయాలకు ఈ నెలాఖరుతో గడువు ముగియనున్న నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్ (ఫాడా) సుప్రీం కోర్టు తలుపు తట్టింది. ప్రస్తుత గడువు(మార్చి 31)లోగా బీఎస్​-4 స్టాక్​ను విక్రయించలేమని.. మే 31 వరకు అమ్మకాలకు అనుమతివ్వాలని పిటిషన్​ దాఖలు చేసింది. ఈ అంశంపై అత్యవసర విచారణ చేయాలని కోరినట్లు తెలిపారు ఫాడా అధ్యక్షుడు ఆశిష్​​ హర్షరాజ్​ కాలే.

విక్రయం కాని ద్విచక్రవాహనాలు 8.35 లక్షలు..

డీలర్ల వద్ద ప్రస్తుతం 8.35 లక్షల బీఎస్​-4 విక్రయం కాని ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. వీటి విలువ దాదాపు రూ.4,600 కోట్ల వరకు ఉండొచ్చు అని ఆశిష్​​ తెలిపారు. వాణిజ్య, ప్యాసింజర్​ వాహనాల పరిస్థితి ద్విచక్ర వాహనాలతో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉన్నట్లు పేర్కొన్నారు.

గడువు పెంచాలని ఫిబ్రవరి 14నే ఫాడా పిటిషన్ దాఖలు చేయగా సుప్రీం దాన్ని తిరస్కరించింది.

''అప్పటితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు తలకిందులయ్యాయి. కరోనా వైరస్​ వ్యాప్తితో అమ్మకాలు భారీగా క్షీణించాయి. వినియోగదారులు కొనుగోళ్లపై పెద్దగా దృష్టి సారించడం లేదు. కరోనా వైరస్​ నేపథ్యంలో డీలర్లకు 60 నుంచి 70 శాతం వరకు విక్రయాలు తగ్గాయి. గత 3,4 రోజుల నుంచి పలు పట్టణాల్లో పరిస్థితులు మరీ క్లిష్టంగా మారాయి.''

- ఆశిష్​ హర్షరాజ్​ కాలే, ఫాడా అధ్యక్షుడు

సియామ్​ మరో పిటిషన్​..

బీఎస్​-4 వాహనాల విక్రయాలకు ఈ నెల 31 వరకు గడువు ఉండగా.. కొన్ని రాష్ట్రాలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 29 వరకే అందుకు అనుమతిస్తున్నట్లు వాహన పరిశ్రమల విభాగం సియామ్ తెలిపింది. ఏప్రిల్ 1నుంచి బీఎస్​-6 వాహనాలకే రిజిస్ట్రేషన్​లు ఉంటాయని స్పష్టం చేసినట్లు తెలిపింది. ఈ విషయాలన్నింటిపైన సియామ్​ కూడా ఇటీవలే సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయాలు అటు డీలర్లతో పాటు కొనుగోలుదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు పిటిషన్​లో పేర్కొంది.

ఇదీ చూడండి:స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. 10 గ్రాములు ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.