ప్రముఖ సామాజిక మాధ్యమం (facebook latest news) ఫేస్‌బుక్ పేరు మార్చుతున్నట్లు ఆ కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఈ రోజు జరిగిన కంపెనీ వార్షిక సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఫేస్‌బుక్‌తోపాటు కంపెనీకి చెందిన ఇతర సామాజిక మాధ్యమాలు ఇన్‌స్టాగ్రాం, మెసేంజర్, వాట్సాప్ పేర్లలో ఎలాంటి మార్పు ఉండబోదని కంపెనీ తెలిపింది. ఫేస్‌బుక్‌కు చెందిన అన్ని కంపెనీలకు 'మెటా' మాతృసంస్థగా ఉండబోతుందని వెల్లడించారు. "ఫేస్‌బుక్ కొత్త పేరు మెటా. తర్వాతి తరం సోషల్ మీడియా మెటావర్స్‌ను మనకు అందించేందుకు ఈ మెటా సాయపడుతుంది" అని ఫేస్‌బుక్ తన ట్వీట్‌లో పేర్కొంది.
గత కొంత కాలంగా ఫేస్‌బుక్ వ్యక్తిగత ప్రయోజనాలు లక్ష్యంగా యూజర్ డేటాను ట్రాక్ చేస్తుందన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాల్లో ఫేస్‌బుక్ న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటోంది. దీంతో ఫేస్‌బుక్ పేరు తరచుగా వార్తల్లో రావడం యూజర్లపై ప్రభావం చూపిస్తోందని కంపెనీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఫేస్‌బుక్‌కి చెందిన అన్ని కంపెనీలను ఒకే కొత్త కంపెనీ కిందకు తీసుకురావాలని కంపెనీ నిర్ణయించింది. అందులోభాగంగానే ఫేస్‌బుక్ పేరును ‘మెటా’గా మారుస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగి డాక్యుమెంట్లను లీక్ చేయడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి.
మరోవైపు జుకర్‌బర్గ్ గత కొద్దిరోజులుగా మెటావర్స్ సాంకేతికతపై దృష్టి పెట్టారు. ఇప్పటికే వేలాది మందిని దీనికోసం నియమించుకున్నారు. దీంతో టెక్ నిపుణుల దృష్టి దీనిపై పడింది.
ఇదీ చదవండి:మెగా ఐపీఓకు పేటీఎం రెడీ- టార్గెట్ రూ.18,300 కోట్లు!