ETV Bharat / business

'ప్రొఫైల్​ లాక్​'తో మీ ఎఫ్​బీ ఖాతా మరింత భద్రం! - ఫేస్​బుక్ ప్రొఫైల్ లాక్​

ఫేస్​బుక్ భారతీయ ఖాతాదారుల కోసం 'ప్రొఫైల్ లాక్' అనే కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. దీనిని ఫేస్​బుక్​ ఖాతాదారులు ఎనేబుల్​ చేస్తే... వారి అనుమతి లేకుండా నాన్​ ఫ్రెండ్స్​ ఎవ్వరూ వారి ప్రొఫైల్​, ఫోటోలు, టైమ్​లైన్​లోని పోస్టులు చూడలేరు.

Facebook announces new feature for India allowing users to lock their profiles
ఫేస్​బుక్ ప్రొఫైల్ లాక్​
author img

By

Published : May 25, 2020, 3:12 PM IST

సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్​... తన భారతీయ ఖాతాదారుల కోసం ఓ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. దీనితో ఫేస్​బుక్​ ఖాతాదారులు తమ ప్రొఫైల్​ను లాక్​ చేసుకోవచ్చు. ఫలితంగా అపరిచితులు.. అనుమతి లేకుండా వారి ప్రొఫైల్, ఫోటోల​ను చూడకుండా నిలువరించవచ్చు.

ప్రైవసీకి ప్రాధాన్యం..

తమ వేదికను మరింత సురక్షితమైనదిగా చేయడమే తాజా ఫీచర్ లక్ష్యమని ఫేస్​బుక్​ తెలిపింది. ఖాతాదారుల గోప్యతకు భంగం కలుగకుండా చూడడం... ముఖ్యంగా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా చూడడమే ఈ ఫీచర్​ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది.

ఈ ఫీచర్ ఎనేబుల్ చేస్తే..

ఫేస్​బుక్​ ఖాతాదారులు 'ప్రొఫైల్ లాక్' ఫీచర్​ను ఎనేబుల్ చేస్తే... అప్పటి నుంచి వారి ప్రొఫైల్​ను ఎవ్వరూ అనుమతి లేకుండా చూడలేరు. ఫోటో జూమ్, షేర్, డౌన్​లోడ్ చేసే అవకాశమూ ఉండదు. అలాగే యూజర్ టైమ్​లైన్​లోని ఫోటోలు, పోస్టులను కూడా వీక్షించలేరు.

facebook profile lock
ఫేస్​బుక్ ప్రొఫైల్ లాక్​

అలాగే ఓ ఫేస్​బుక్ యూజర్ ప్రొఫైల్​ని... అపరిచితులు(నాన్​-ఫ్రెండ్​) సందర్శించాలని ప్రయత్నించినప్పుడల్లా ఒక పాప్​-ఆప్​ వస్తుంది. సదరు ఖాతాదారుడు తన ప్రొఫైల్​ను లాక్​ చేశాడని అది చెబుతుంది. ఫేస్​బుక్ ప్రకారం, ఓ నాన్​ ఫ్రెండ్​కి ఐదు ప్రొఫైల్స్​ వివరాలు మాత్రమే కనిపిస్తాయి.

ప్రస్తుతానికి ఈ 'ప్రొఫైల్​ లాక్​ ఫీచర్' ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది.

ఇదీ చూడండి: 'వర్క్​ ఫ్రమ్​ హోమ్​' ఉద్యోగాల కోసం భారతీయుల వేట

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.