ETV Bharat / business

పీఎఫ్ ఖాతాదారులకు ఊరట- ఆధార్​తో పుట్టిన తేదీ మార్పు

పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం మరో ఊరట కల్పించింది. పుట్టిన తేదీ మార్పులు సహా ఆన్​లైన్​లో కేవైసీ పూర్తి చేయడానికి ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. లాక్​డౌన్​ నేపథ్యంలో ఆన్​లైన్​ సేవలు అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది.

EPFO to accept Aadhaar as birth proof online from subscribers
పీఎఫ్ ఉద్యోగులకు ఊరట
author img

By

Published : Apr 5, 2020, 8:25 PM IST

పీఎఫ్ ఖాతాదారుల విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పుట్టిన తేదీ ఆన్ లైన్ ధ్రువీకరణ కోసం ఇక నుంచి ఆధార్ కార్డును పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది. కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్​లైన్​ సేవలు అందరికీ అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర శ్రామిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. పుట్టిన తేదీ మార్పులకోసం ఆన్ లైన్ లో అర్జీ పెట్టుకోవచ్చని తెలిపింది.

"కేవైసీ నిర్ధరణ కోసం పీఎఫ్ సభ్యులు రికార్డుల్లోని తమ పుట్టిన తేదీని సవరించుకునేందుకు నిబంధనలు సవరించి ఫీల్డ్ అధికారులకు ఈపీఎఫ్ఓ ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్-19 విస్తృతి నేపథ్యంలో ఆన్ లైన్ సేవలు అందరికీ అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఈపీఎఫ్ఓ ఈ నిర్ణయం తీసుకుంది."-శ్రామిక మంత్రిత్వ శాఖ ప్రకటలోని భాగం

పీఎఫ్ సభ్యులు విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ ద్వారా తక్షణమే తమ పుట్టిన తేదీని ధ్రువీకరించుకోవచ్చని శ్రామిక శాఖ పేర్కొంది. ఈ నిర్ణయంతో ప్రాసెసింగ్ సమయాన్ని కూడా తగ్గించవచ్చని తెలిపింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రావిడెంట్ ఫండ్ సభ్యుల ఆన్ లైన్ నాన్-రీఫండబుల్ విత్ డ్రా అభ్యర్థనలను వేగంగా పరిష్కరించాలని ఫీల్డ్ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది.

అంతకుముందు మూడు నెలల వేతనాన్ని విత్ డ్రా చేసుకునే వీలు కల్పిస్తూ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రం. కరోనా వైరస్ కారణంగా లాక్​డౌన్​ కొనసాగుతున్న నేపథ్యంలో ఉద్యోగులకు ఆర్థికంగా ఊరట కల్పించేందుకు ఈ నిర్ణయం ప్రకటించింది. అయితే కేవైసీ పూర్తి చేసిన సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది.

ఇదీ చదవండి: ఆర్థిక మాంద్యం 2008 X 2020.. ఏంటి తేడా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.