మార్చి- డిసెంబర్ మధ్యలో 56లక్షల 79 మంది ఉద్యోగులకు భవిష్య నిధి చెల్లింపులు జరిగాయి. ఈ పథకం కింద ఉద్యోగుల భవిష్యనిధి సంస్ధ (ఈపీఎఫ్ఓ) ..14వేల 310 కోట్ల రూపాయలను చెల్లించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో గతేడాది మార్చిలో కేంద్రం ప్రారంభించిన కొత్త పథకంలో భాగంగా వీటిని ముట్టజెప్పింది.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 6కోట్ల మంది ఉద్యోగులు తమ మూడు నెలల మూలవేతనం, కరవు భత్యం పరిమితి దాటకుండా భవిష్యనిధి ఉపసంహరించుకునే అవకాశం కల్పించింది. భవిష్యనిధి మొత్తంలో 75శాతం వరకు ఉపసంహరించుకునే మరో అవకాశం ఇచ్చింది. ప్రైవేటు ఈపీఎఫ్ సంస్ధలు కొత్త పథకం కింద 4లక్షల 19వేల మంది ఉద్యోగులకు 3వేల 983 కోట్ల రూపాయల భవిష్యనిధిని చెల్లించాయి. ఉద్యోగుల ఆర్థిక పరిష్కారాలు, మరణం, బీమా, అడ్వాన్సుల కోసం ఈపీఎఫ్ఓ 2020 డిసెంబర్ 31 వరకు కోటి 98లక్షల మందికి నగదు చెల్లించింది.
ఇదీ చదవండి:'ఈ రైలు సర్వీసులతో కేవడియా పర్యటకానికి ఫుల్ జోష్'