ETV Bharat / business

కరోనా కష్టమా? పీఎఫ్​ నుంచి డబ్బు తీసుకోండిలా... - ఈపీఎఫ్​ఓ డబ్బుల ఉపసంహరణ

కరోనా 2.0 నేపథ్యంలో చందాదారులు తమ డబ్బులను ముందుగానే ఉపసంహరించుకునే వెసులుబాటును కల్పించింది ఈపీఎఫ్​ఓ. వాటి వివరాలు...

epfo covid advance
ఈపీఎఫ్​ఓ డబ్బుల ఉపసంహరణ
author img

By

Published : May 31, 2021, 5:14 PM IST

కరోనా సంక్షోభం నేపథ్యంలో తమ చందాదారులు డబ్బులు ముందుగానే ఉపసంహరించుకునే వీలు కల్పించింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ-ఈపీఎఫ్​ఓ. సంక్షోభ పరిస్థితుల్లో ఈ వెసులుబాటు ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

కరోనా తొలి దశలోనూ ఇలాంటి చర్యలు చేపట్టింది ఈపీఎఫ్​ఓ. 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్​ కళ్యాన్​ యోజన కింద.. డబ్బులు ముందుగానే విత్​డ్రా చేసుకునే వెసులుబాటును కల్పించింది.

వివరాలు ఇలా..

  • మూడు నెలల మూలవేతనం, కరవు భత్యం పరిమితి దాటకుండా.. లేదా భవిష్యనిధి మొత్తంలో 75శాతం మించకుండా (రెండింట్లో ఏది తక్కువ అయితే అది).. డబ్బులు విత్​డ్రా చేసుకోవచ్చు.
  • కరోనా తొలి దశలో ఈ వెసులుబాటును ఉపయోగించుకున్న వారు ఇప్పుడు కూడా తీసుకోవచ్చు.
  • తొలి దశలో ఉన్న నిబంధనలు, ప్రక్రియే ఇప్పుడూ ఉంటుంది.
  • సంక్షోభ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, అభ్యర్థన అందిన మూడు రోజుల్లోనే క్లెయిమ్స్​ను సెటిల్​ చేసే విధంగా ఓ వ్యవస్థను రూపొందించింది ఈపీఎఫ్​ఓ. (సాధారణంగా అయితే ఇది 20రోజులు)

ఇప్పటివరకు.. 76.31 లక్షల క్లెయిమ్స్​ను మంజూరు చేసి, రూ. 18,698.15కోట్లను అందించింది ఈపీఎఫ్​ఓ.

ఇదీ చూడండి:- PF ఖాతాదారులకు అలర్ట్- ఈ రోజే ఆఖరు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.