ETV Bharat / business

ప్రపంచ కుబేరుడిగా ఎలాన్​ మస్క్​

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా విద్యుత్తు కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలాన్​ మస్క్​ అవతరించారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో 2017 అక్టోబర్‌ నుంచి తొలి స్ధానంలో ఉన్న అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ను ఎలాన్‌ అధిగమించారు.

Elan musk now be a number rich man in the world
ప్రపంచ నెంబర్​వన్​ కుబేరుడిగా ఎలాన్​ మస్క్​
author img

By

Published : Jan 8, 2021, 5:50 AM IST

Updated : Jan 8, 2021, 6:58 AM IST

విద్యుత్తు కార్ల తయారీ సంస్ధ టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడుగా అవతరించారు. న్యూయార్క్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో టెస్లా షేరు విలువ గురువారం 4.8శాతం పెరగడం వల్ల ఆయన ప్రపంచ సంపన్న జాబితాలో తొలి స్ధానానికి చేరుకున్నారు. ప్రపంచ ధనవంతుల జాబితాలో 2017 అక్టోబర్‌ నుంచి తొలి స్ధానంలో ఉన్న అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ను ఎలాన్‌ అధిగమించారు.

మస్క్‌ సంపద సుమారు రూ.14.13 లక్షల కోట్లకు చేరుకుంది. ఏడాది వ్యవధిలోనే ఆయన సంపద 150 బిలియన్‌ డాలర్లకు పైగా పెరిగింది. ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేగంగా ఇంత సంపద సృష్టించిన రికార్డు ఈయనదే. టెస్లా షేరు ధర ఏడాది క్రితంతో పోలిస్తే ఏకంగా 743శాతం పెరగడం వల్ల ఇది సాధ్యమైంది.
ఇదీ చూడండి: అమెజాన్​ అధినేత ఓ కాపీ క్యాట్​: ఎలాన్​ మస్క్​

Last Updated : Jan 8, 2021, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.