ETV Bharat / business

కరోనా సంక్షోభంలోనూ రాణిస్తున్న ఎడ్‌టెక్‌ కంపెనీలు - edtech companies

కరోనా సంక్షోభం కారణంగా అనేక సంస్థలు కుదేలయ్యాయి. కొన్ని మూతపడ్డాయి. ఇంతటి విపత్కర పరిస్థితిలోనూ కొన్ని రంగాలు రాణిస్తున్నాయి. అందులో ఒకటి ఎడ్‌టెక్‌ రంగం. పాఠశాల, కళాశాల విద్యార్థులందరూ ఇంటికే పరిమితం కావడంతో, ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పే ఈ రంగానికి చేయూత లభిస్తోంది. ఎడ్‌టెక్‌ అంకురాలు గత ఏడు నెలల కాలంలో బాగా రాణించాయి. వీక్షకులు 3-5 రెట్లు పెరగడంతో ఆదాయం సైతం 50-100 శాతం వరకు పెరిగింది.

edtech companies in profits during covid crisis
మహమ్మారి కాసులుగా మారి.. రాణిస్తున్న ఎడ్‌టెక్‌ కంపెనీలు
author img

By

Published : Aug 16, 2020, 5:22 AM IST

కరోనా కారణంగా ప్రపంచమంతా డీలా పడింది. ఎన్నో రంగాలు కుదేలయ్యాయి. కొన్ని కంపెనీలు మూతపడ్డాయి. మరికొన్ని నష్టాల్లో నడుస్తున్నాయి. అయితే ఇంతటి సంక్షోభంలోనూ రాణిస్తున్న రంగాలు లేకపోలేదు. అందులో ఒకటి ఎడ్‌టెక్‌ రంగం. పాఠశాల, కళాశాల విద్యార్థులందరూ ఇంటికే పరిమితం కావడంతో, ఆన్‌లైన్‌లో పాఠాలు చెప్పే ఈ రంగానికి చేయూత లభిస్తోంది. వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌లు సైతం ఈ అంకుర కంపెనీల్లో పెట్టుబడులు పెడుతున్నాయి.

ఎడ్‌టెక్‌ అంకురాలు గత ఏడు నెలల కాలంలో బాగా రాణించాయి. వీక్షకులు 3-5 రెట్లు పెరగడంతో ఆదాయం సైతం 50-100% వరకు పెరిగింది. ఈ వృద్ధిని అందిపుచ్చుకోవడానికి వెంచర్‌ క్యాపిటలిస్టులు(వీసీ) రంగంలోకి దిగినట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే.. జనవరి-జులైలో ఎడ్‌టెక్‌ సంస్థల్లోకి ఏకంగా 998 మిలియన్‌ డాలర్లు వచ్చాయి. మొత్తం 31 ఒప్పందాలు జరిగాయి. వెంచర్‌ ఇంటలిజెన్స్‌ సమాచారం ప్రకారం.. 2020లో అత్యంత ఎక్కువ నిధులు రాబట్టిన రంగం ఇదే.

గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఈ రంగానికి బాగా కలిసొచ్చినట్లే చెప్పాలి. ఎందుకంటే 2019 తొలి ఏడు మాసాల్లో 24 ఒప్పందాలు జరిగాయి. 310 మి. డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం ఏడాది చూసినా.. 42 ఒప్పందాల ద్వారా 404 మి. డాలర్ల మేరకే వెంచర్‌ క్యాపిటలిస్టులు పెట్టుబడులుగా పెట్టారు. ఇవి ఈ ఏడాది రెండింతలు కావడం చూస్తుంటే ప్రైవేటు ఈక్విటీ(పీఈ)-వీసీ పెట్టుబడుదార్లు వాటిపై ఎంతగా విశ్వసిస్తున్నాయో తెలుస్తోంది. ట్యూటరింగ్‌, పరీక్ష సన్నద్ధత అప్లికేషన్లపైనా మదుపర్లు దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

టాప్‌ అదే..

ఈ ఏడాది రెండు దశల్లో మొత్తం మీద 500 మి. డాలర్ల(దాదాపు రూ.3750 కోట్లు) వరకు నిధులను బైజూస్‌ క్లాసెస్‌ రాబట్టుకోగలిగింది. ఈ కంపెనీలో టైగర్‌ గ్లోబల్‌, జనరల్‌ అట్లాంటిక్‌లు వరుసగా జనవరి, ఫిబ్రవరిల్లో 300 మి. డాలర్లు; 200 మి. డాలర్లు పెట్టుబడులుగా పెట్టాయి. వేదాంతులోనూ జీజీవీ క్యాపిటల్‌, కోట్‌ మేనేజ్‌మెంట్‌, వెస్ట్‌బ్రిడ్జ్‌, ఒమిద్యాయ్‌ నెట్‌వర్క్‌, టైగర్‌గ్లోబల్‌లు 100 మి. డాలర్ల వరకు జతచేశాయి. ఇక టాపర్‌ సైతం 47 మి. డాలర్లను వివిధ వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్‌ సంస్థల నుంచి పొందగలిగింది.

విద్యా రంగానికే ఎక్కువ ఆకర్షణ

ఈ ఏడాదిలో తొలి అర్థభాగంలో వివిధ రంగాల్లోని అంకురాల్లో విద్యా రంగమే అత్యధిక నిధులను రాబట్టుకుంది. ఇందులోకి 795 మి. డాలర్లు వచ్చాయి. ఇక ప్రయాణ, రియల్‌ ఎస్టేట్‌ టెక్‌, ఫిన్‌టెక్‌, ఆహార-పానీయాలు, ఇ-కామర్స్‌, ఆరోగ్య సంరక్షణ రంగాలు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇ-కామర్స్‌లోకి 2019లో 3,046 మి. డాలర్లు రాగా.. ఈ సారి అవి 393 మి. డాలర్లకే పరిమితం కావడం గమనార్హం. ఫిన్‌టెక్‌లోనూ గతేడాది 1,530 మి. డాలర్ల పెట్టుబడులు రాగా.. ఈ సారి 597 మి. డాలర్లే వచ్చాయి.

ఇదీ చూడండి: అమెజాన్​లో ఇక నుంచి ఔషధాల డెలివరీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.