ETV Bharat / business

ఎస్​ బ్యాంక్​ వ్యవస్థాపకుడు​ రానా కపూర్ అరెస్టు

ఎస్​ బ్యాంకు వ్యవస్థాపకుడు, డైరెక్టర్ రానా కపూర్​ను అక్రమ నగదు చలామణి కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ఇవాళ అరెస్టు చేసింది. ఆయనను ఈరోజే స్థానిక కోర్టులో హాజరుపరచనుంది. కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి అడగనుంది.

ED arrests Yes Bank founder Rana Kapoor under PMLA
ఎస్​ బ్యాంకు డైరెక్టర్​ రానా కపూర్ అరెస్టు
author img

By

Published : Mar 8, 2020, 7:38 AM IST

Updated : Mar 8, 2020, 9:31 AM IST

ఎస్​ బ్యాంకు వ్యవస్థాపకుడు, డైరెక్టర్ రానా కపూర్​ను అక్రమ నగదు చలామణి కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్​ (ఈడీ) ఇవాళ అరెస్టు చేసింది. ఆయనను స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. దర్యాప్తులో భాగంగా ఆయనను కస్టడీలోకి తీసుకోవడానికి కోర్టు అనుమతి అడగనున్నట్లు అధికారులు తెలిపారు.

ఎస్​ బ్యాంకు సంక్షోభంలో కీలక పాత్రధారి అయిన ఆయనను ఇవాళ ఉదయం 3 గంటల సమయంలో మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం అరెస్టు చేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. అయితే అతను దర్యాప్తునకు సహకరించడం లేదని వారు తెలిపారు.

శుక్రవారం రాత్రి రానా కపూర్ నివాసంలో తనిఖీలు చేపట్టిన ఈడీ.. తరువాత ఆయనను 20 గంటలకు పైగా విచారించింది. మరిన్ని సాక్ష్యాలు, సమాచారం సేకరించేందుకుగాను శనివారం దిల్లీ, ముంబయిల్లోని ఆయన ముగ్గురు కూతుళ్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించింది. కపూర్​ భార్య బిందు, కుమార్తెలు రాఖీ కపూర్​ టాండన్, రోష్నీ కపూర్​, రాధా కపూర్​లకు కూడా ఈ అక్రమాలతో సంబంధం ఉన్నట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు.

అభియోగాలు.. విచారణ

ఎస్ బ్యాంకు సంక్షోభానికి దారితీసిన అవకతవకల్లోనూ కపూర్‌ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. డీహెచ్ఎఫ్​ఎల్​ సంస్థకు ఎస్​ బ్యాంకు ఇచ్చిన రుణాలు నిరర్ధక ఆస్తులుగా మారాయి. ఈ రుణాల విషయంలో రానాకపూర్​ పాత్రపై ఈడీ అనుమానిస్తోంది. మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల్లోనూ కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు సంస్థకు ఇచ్చిన రుణాలకు ప్రతిఫలంగా వారి నుంచి ఆయన కొంత సొమ్ము పొందారన్న అభియోగాలు ఉన్నాయి. ఆయన భార్య ఖాతాలోకి అవి చేరినట్లు ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. వీటన్నింటిపైనా ఈడీ దర్యాప్తు చేస్తోంది.

ఇదీ చూడండి: మహిళా దినోత్సవం స్పెషల్..​ ఆ నగరంలో భారీ డిస్కౌంట్లు

Last Updated : Mar 8, 2020, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.