భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విమాన ధరలు జులైతో పోలిస్తే ఆగస్టు నాటికి గణనీయంగా పెరిగాయని వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది పౌర విమానయాన మంత్రిత్వ శాఖ. దిల్లీ-లండన్ విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర ఆగస్టులో రూ.1.03 లక్షల నుంచి రూ.1.47 లక్షల వరకు ఉన్నట్లు స్పష్టం చేసింది.
-
There are media reports claiming India-UK one-way economy class fares have touched Rs. 4 lakhs. These reports have no proven basis. The veracity of Sh Sanjeev Gupta’s claim has been thoroughly checked by @DGCAIndia.
— MoCA_GoI (@MoCA_GoI) August 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">There are media reports claiming India-UK one-way economy class fares have touched Rs. 4 lakhs. These reports have no proven basis. The veracity of Sh Sanjeev Gupta’s claim has been thoroughly checked by @DGCAIndia.
— MoCA_GoI (@MoCA_GoI) August 8, 2021There are media reports claiming India-UK one-way economy class fares have touched Rs. 4 lakhs. These reports have no proven basis. The veracity of Sh Sanjeev Gupta’s claim has been thoroughly checked by @DGCAIndia.
— MoCA_GoI (@MoCA_GoI) August 8, 2021
" భారత్-యూకే మధ్య ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు రూ.4 లక్షలకు చేరుకున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. వాటికి సరైన ఆధారాలు లేవు. సంజీవ్ గుప్తా చేసిన వ్యాఖ్యలను డీజీసీఏ నిశితంగా పరిశీలించింది. 2021, ఆగస్టులో దిల్లీ-లండన్ మధ్య నడిచే భారత విమానాల్లో ఎకానమీ క్లాస్ టికెట్ ధర రూ.1.03-1.21 లక్షలు, బ్రిటన్ విమానాల్లో రూ.1.28-1.47 లక్షలుగా ఉన్నాయి. "
- పౌర విమానయాన మంత్రిత్వ శాఖ.
ఆగస్టు 26న దిల్లీ నుంచి లండన్‌కు వెళ్లే బ్రిటన్ విమానాల్లో ఎకానమీ టికెట్ ధర..రూ.3.95 లక్షలుగా ఉందని ట్విట్టర్ వేదికగా ఇంటర్-స్టేట్ కౌన్సిల్ కార్యదర్శి సంజీవ్ గుప్తా తెలిపారు. విస్తారా, ఎయిర్ ఇండియాలో ఈ ధర రూ.1.2 లక్షల నుంచి రూ.2.3 లక్షల మధ్య ఉందని చెప్పారు. దీనిపై దృష్టి సారించాల్సిందిగా కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి పీఎస్ ఖరోలియాను కోరినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన పౌర విమానయాన డైరెక్టర్ జనరల్.. టికెట్ ధరలపై నివేదిక సమర్పించాలని అన్ని విమాన సంస్థలను ఆదేశించారు.
ఇదీ చూడండి: విదేశీ ప్రయాణికులకు షాక్- భారీగా పెరిగిన టికెట్ ధరలు