కరోనా చికిత్సలో సత్ఫలితాలనిస్తున్న 2 డీజీ(2DG drug) కొవిడ్ ఔషధం ధరను నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు ఒక సాచెట్ ధర.. 990 రూపాయలకు డాక్టర్ రెడ్డీస్ అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాయితీ ఉంటుందని పేర్కొన్నాయి.
పొడిరూపంలో ఉండే 2డీజీ ఔషధాన్ని(2DG drug) హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి డీఆర్డీఓ (DRDO ) ఆధ్వర్యంలోని ఇన్‌మాస్ అభివృద్ధి చేసింది. ఆక్సిజన్ అవసరమైన కొవిడ్ బాధితులు త్వరగా కోలుకునేలా ఈ ఔషధం పనిచేస్తున్నట్లు డీఆర్డీఓ ప్రకటించింది. నీటిలో కలుపుకుని తాగేలా పౌడర్ రూపంలో ఉన్న ఈ ఔషధానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ డీజీసీఐ ఇటీవలె అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చింది.