ETV Bharat / business

స్పుత్నిక్ టీకా విషయంలో థర్డ్​పార్టీపై చర్యలు!

స్పుత్నిక్ వి వ్యాక్సిన్​ను భారత్​లో అందించేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టమెంట్ ఫండ్​తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో స్పుత్నిక్ టీకాను అందించేందుకు తమ సంస్థ మాత్రమే ఏకైక సరఫరాదారు అని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది.

vaccine
డాక్టర్ రెడ్డీస్, స్పుత్నిక్ వీ వ్యాక్సిన్
author img

By

Published : May 28, 2021, 10:13 PM IST

స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ ను భారత్ లో అందించేందుకు ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ మాత్రమే ఏకైక సరఫరాదారు అని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. భారత్​లో తమ కంపెనీ కాకుండా స్పుత్నిక్ వ్యాక్సిన్​ను అందిస్తామనే థర్డ్ పార్టీ వ్యక్తులు, సంస్థలపై జాగ్రత్త వహించాలని డాక్టర్ రెడ్డీస్, ఆర్​ఐఎఫ్ సంయుక్తంగా ప్రకటించాయి. స్పుత్నిక్ వి వ్యాక్సిన్​ను భారత్​లో అందించేందుకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టమెంట్ ఫండ్​తో డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరీస్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. తద్వారా 250 మిలియన్ డోసుల వ్యాక్సిన్​ను దేశవ్యాప్తంగా డాక్టర్ రెడ్డీస్ అందించనుంది. ఇందుకోసం ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీ లాజిస్టిక్స్, ట్రాక్ అండ్ ట్రేస్ వంటి ఏర్పాట్లపై కంపెనీ పనిచేస్తోంది.

తద్వారా జూన్ మధ్య నాటికి వ్యాక్సిన్ ను కమర్షియల్ లాంఛ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తూ.. ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్లతో ఒప్పందాల కొరకు చర్చలు జరుపుతోంది. అయితే స్పుత్నిక్ వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ తరుపున సరఫరా కొరకు తాము ఇప్పటివరకు ఎటువంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని.. స్పుత్నిక్ వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ కాకుండా తామే సరఫరాదారులంటూ ఎవరైనా పేర్కొంటే వారి పట్ల జాగ్రత్త వహించాలని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది. ఈమేరకు రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్ తో కలిసి సంయుక్త ప్రకటనను విడుదల చేసింది.

స్పుత్నిక్ - వి వ్యాక్సిన్ ను డాక్టర్ రెడ్డీస్ కాకుండా దిగుమతి, సరఫరాను తమ ద్వారా జరపుతామంటోన్న థర్ట్ పార్టీ వ్యక్తులు, వ్యవస్థలతో తమకు సంబంధం లేదని, అలా ఇప్పటివరకు తమతో ఎటువంటి ఒప్పందాలు జరగలేదని కంపెనీ పేర్కొంది. స్పుత్నిక్ వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ ప్రక్రియలో అనధికార ఒప్పందాలు, మోసపూరిత లావాదేవీలతో సంబంధం లేదని తమ కంపెనీ పేరుతో అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలుంటాయని డాక్టర్ రెడ్డీస్ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:Remdesivir: నకిలీ ఔషధాలకు జైడస్ క్యాడిలా చెక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.