ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- మళ్లీ 39 వేల పైకి సెన్సెక్స్ - సెన్సెక్స్

హెవీ వెయిట్, ఐటీ షేర్ల దన్నుతో స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 185 పాయింట్లు బలపడి తిరిగి 39 వేల మార్క్​ దాటింది. నిఫ్టీ 65 పాయింట్లు పుంజుకుంది.

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Sep 2, 2020, 3:51 PM IST

Updated : Sep 2, 2020, 8:17 PM IST

స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ-సెన్సెక్స్ 185 పాయింట్లు పెరిగి 39,086 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 65 పాయింట్ల లాభంతో 11,535 వద్దకు చేరింది.

అమ్మకాల ఒత్తిడితో ఒకానొక దశలో భారీ నష్టాల్లోకి జారుకున్న సూచీలు.. హెవీ వెయిట్, ఐటీ షేర్ల దన్నుతో చివరకు లాభాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలూ మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. భారత్-చైనా మధ్య తీవ్ర ఉద్రిక్తతలున్నా.. మార్కెట్లు సానుకూలంగా ముగియటం గమనార్హం.

ఇంట్రాడే సాగిందిలా

సెన్సెక్స్ 39,141 పాయింట్ల అత్యధిక స్థాయి, 38,736 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 11,549 పాయింట్ల గరిష్ఠ స్థాయి;11,430 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎం&ఎం,పవర్​గ్రిడ్, టాటా స్టీల్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, హెచ్​సీఎల్​టెక్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.

బజాజ్ ఆటో, ఏషియన్​ పెయింట్స్, సన్​ఫార్మా, హెచ్​డీఎఫ్​సీ, నెస్లే ఇండియా, హెచ్​యూఎల్​ షేర్లు నష్టపోయాయి.

ఆసియా మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, హాంకాంగ్ సూచీలు బుధవారం నష్టపోయాయి. టోక్యో, సియోల్ సూచీలు మాత్రం లాభాలను నమోదు చేశాయి.

రూపాయి, ముడి చమురు

కరెన్సీ మార్కెట్​లో రూపాయి మారకం16 పైసలు తగ్గింది. దీనితో డాలర్​తో పోలిస్తే మారకం విలువ 73.03 వద్దకు చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 0.88 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 45.98 డాలర్లకు చేరింది.

మార్కెట్లో నేడు

ఇదీ చూడండి:పట్టణాల్లో పది మందిలో ఒకరు నిరుద్యోగి!

Last Updated : Sep 2, 2020, 8:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.