ETV Bharat / business

కరోనా 2.0తో విమాన సంస్థలకు రూ.10 వేల కోట్ల నష్టం!

కరోనా రెండో దశ విజృంభణ విమానయాన సంస్థలకు మరోసారి భారీ నష్టాలు తెచ్చిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. 2021-22లో దేశీయ విమానయాన సంస్థలకు రూ.10 వేల కోట్ల వరకు నష్టం వాటిల్లే ప్రమాదముంది.

author img

By

Published : Apr 16, 2021, 11:31 AM IST

Airlines Sector
విమానయాన రంగం

కరోనా అనంతర పరిస్థితుల కారణంగా.. దేశీయంగా విమాన రాకపోకలు భారీగా తగ్గాయి. ఇంధన ధరలు కొండెక్కి కూర్చున్నాయి. దీనికి తోడు అంతర్జాతీయ విమాన ప్రయాణాలు పాక్షికంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితులన్నీ దేశీయ విమానయాన సంస్థలకు ఈ ఆర్థిక సంవత్సరం(2021-22) రూ.9,500- రూ.10,000 కోట్ల నష్టాన్ని మిగల్చనున్నట్లు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ అంచనా వేసింది. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే (రూ.14-15 వేల కోట్లు) ఈ నష్టాలు 35-40 శాతం తక్కువగా ఉండొచ్చని పేర్కొంది.

దేశీయ విమానయాన రంగంలో మూడు అతి పెద్ద సంస్థలపై జరిపిన విశ్లేషణ ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ విషయాలు పేర్కొంది క్రిసిల్​. ప్యాసింజర్​ ట్రాఫిక్​ పరంగా ఈ మూడు విమాన సంస్థల వాటానే 78 శాతం.

నివేదికలో తేలిన మరిన్ని విషయాలు..

  • 2020-21లో 25-30 శాతం పెరిగిన రుణాలు(లీజింగ్​ లియబిలిటీస్ మినహాయించి).. ప్రస్తుత ఆర్థిక సంవత్సర నష్టాలకు కారణం కానున్నాయి. దీని వల్ల విమానయాన సంస్థల బ్యాలెన్స్​ షీట్లపై తీవ్ర ఒత్తిడి పడనుంది.
  • దేశవ్యాప్తంగా.. ముఖ్యంగా ముంబయి, దిల్లీ వంటి ప్రధాన నగరాల్లో (ఎయిర్​ట్రాఫిక్​లో 36 శాతం వాటా ఈ నగరాలదే) కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల ఈ రంగం రికవరీ మరో ఆరు నెలలు ఆలస్యం అవ్వొచ్చు.
  • కేసులు పెరగటం వల్ల రోజువారీ దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య.. ఏప్రిల్​లో 20 శాతం (ఫిబ్రవరితో పోలిస్తే) తగ్గింది. ఫిబ్రవరిలో రోజుకు సగటున 2.35 లక్షల మంది విమానాల్లో ప్రయాణించారు.
  • దేశీయ ప్రయాణికుల ద్వారా వచ్చే(విమానయాన సంస్థల రెవెన్యూలో 75 శాతం వాటా) ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం 132-130 శాతం పెరగొచ్చు. 2019-20తో పోలిస్తే మాత్రం ఈ మొత్తం 70 శాతం తక్కువే. లాక్​డౌన్ వల్ల గత ఆర్థిక సంవత్సరం ఈ ఆదాయం 68 శాతం తగ్గింది.
  • ఏటీఎఫ్(విమానాల్లో వాడే ఇంధనం) ధర పెరగటం వల్ల విమాన సంస్థల ఖర్చులు మరింత పెరిగాయి. 2020 నవంబర్​ నుంచి ఏటీఎఫ్​ ధరలు 30 శాతం పెరిగాయి.

ఇదీ చదవండి:అత్యవసర నిధి ఏర్పాటు చేసుకున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.