ETV Bharat / business

పెరిగిన విమాన ప్రయాణాలు- కరోనా నుంచి కోలుకున్నట్లేనా? - విమాన ప్రయాణాల్లో వృద్ధి

విమాన ప్రయాణాలు దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నట్లు రేటింగ్​ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్​లో దాదాపు 69 లక్షల మంది విమాన ప్రయాణాలు చేసినట్లు తెలిపింది. కరోనా కేసుల్లో తగ్గుదల, ఆంక్షల సడలింపుల వంటివి ఇందుకు కారణంగా పేర్కొంది.

Domestic air passenger grow
పెరిగిన విమాన ప్రయాణాలు
author img

By

Published : Oct 6, 2021, 5:33 PM IST

కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, దాదాపు అన్ని రాష్ట్రాలు ఆంక్షలు సడలిస్తున్న నేపథ్యంలో దేశీయంగా విమాన ప్రయాణాలు ఊపందుకుంటున్నాయి. సెప్టెంబర్​లో దాదాపు 69 లక్షల మంది దేశీయంగా విమాన ప్రయాణాలు చేసినట్లు క్రెడిట్​ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా వెల్లడించింది. ఆగస్టు (67 లక్షలు)తో పోలిస్తే ఈ మొత్తం 2-3 శాతం ఎక్కువని తెలిపింది. పండుగల సీజన్​ కూడా ఇందుకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది.

'2020 సెప్టెంబర్​తో పోలిస్తే.. గత నెలలో దేశీయ విమాన సంస్థలు 54 శాతం అధిక సామర్థ్యంతో పని చేశాయి. ఇదే సమయంలో ప్యాసింజర్​ ట్రాఫిక్​ 74 శాతం పెరిగింద'ని ఇక్రా నివేదిక పేర్కొంది.

ఇక్రా నివేదికలోని ముఖ్యాంశాలు..

  • గత నెలలో దేశీయంగా విమానాలు 61,100 రాకపోకలు సాగించాయి. 2020 సెప్టెంబర్​లో ఈ సంఖ్య 39,628గా ఉంది.
  • 2021 సెప్టెంబర్​లో రోజూవారీగా విమానాలు సగటున 2,100 సార్లు రాకపోకలు సాగించాయి. గత ఏడాది సెప్టెంబర్​లో రోజువారీ సగటు రాకపోకల సంఖ్య 1,321గా ఉంది. 2021 జనవరిలో అత్యధికంగా ఈ సంఖ్య 2,200గా నమోదైంది.
  • సెప్టెంబర్​లో సగటున ఒక విమానంలో ప్రయాణికుల సంఖ్య 113కి తగ్గింది. ఆగస్టులో ఇది 117గా ఉంది.
  • 2021 ఆగస్టు 12 నుంచి విమానాల్లో ప్రయాణికుల సామర్థ్యం 72.5 శాతంగా ఉండగా.. సెప్టెంబర్​ 18 నుంచి 85 శాతానికి పెరిగింది.
  • గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) ధరలు 78.6 శాతం పెరిగాయి.
  • దేశీయ విమానయాన సంస్థలు చాలా వరకు ఇంకా లిక్విడిటీ సమస్యను ఎదుర్కొంటున్నాయి.

ఇదీ చదవండి: 'కరోనాతో విమాన రంగం కుదేలు.. అయినా రికవరీకి ఛాన్స్'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.