హైదరాబాద్‌కు చెందిన అగ్రశ్రేణి ఫార్మా కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం రూ.471 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఆదాయం రూ.1721 కోట్లు ఉంది.
క్రితం ఆర్థిక సంవత్సరం ఇదేకాలంలో ఆదాయం రూ.1438 కోట్లు, నికరలాభం రూ.359 కోట్లు మాత్రమే కావటం గమనార్హం. దీంతో పోల్చితే ఈ మూడో త్రైమాసికంలో ఆదాయం, నికరలాభం గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతుంది. ఇక ఈ ఆర్థిక ఏడాది మొదటి 9 నెలల కాలానికి దివీస్ లేబొరేటరీస్ మొత్తం ఆదాయం రూ.5,224 కోట్లు, నికరలాభం రూ.1,482 కోట్లు ఉన్నాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.4,118 కోట్లు కాగా, నికరలాభం రూ.988 కోట్లు ఉంది.
ఇదీ చదవండి: క్యూ4లో ఫేస్బుక్ అదుర్స్- లాభం 53% జంప్