జూన్ నెలకు సంబంధించి ప్రముఖ ఆటో మొబైల్ సంస్థలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రాలు తమ కార్లపై డిస్కౌంట్లు ఇస్తున్నాయి.
టాటా ఆఫర్లు ఇలా..
టాటా కంపెనీల మోడళ్ల వారీగా రూ.15 వేల నుంచి రూ.65 వేల వరకు డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి. క్యాష్ డిస్కౌంట్, బోనస్ ఎక్స్ఛేంజీ, కార్పొరేట్ డిస్కౌంట్ రూపంలో ఈ మొత్తాన్ని పొందే వీలుంది.
హారియర్, టియాగో, టిగోర్, నెక్సాన్ (డీజిల్ వేరియంట్) కార్లపై ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
టాటా హారియర్ మోడల్‌పై అత్యధికంగా రూ.65 వేల డిస్కౌంట్. ఇందులో రూ.25 వేలు క్యాష్ డిస్కౌంట్. రూ.40 వేలు ఎక్స్ఛేంజీ బోనస్.

టిగోర్ కారుపై రూ.30 వేల వరకు డిస్కౌంట్ (క్యాష్ డిస్కౌంట్ రూ.15 వేలు, ఎక్స్ఛేంజీ ఆఫర్ రూ.15 వేలు)
టాటా టియాగోపై మోడల్‌పై దాదాపు రూ.25 వేల వరకు డిస్కౌంట్ (క్యాష్ డిస్కౌంట్ రూ.15 వేలు, ఎక్స్ఛేంజీ బోనస్ రూ.10 వేలు)

టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్‌పై ఎక్స్ఛేంజీ ఆఫర్ కింద రూ.15 వేల వరకు తగ్గింపు.

మహీంద్రా ఆఫర్లు..
మహీంద్రా ఏకంగా రూ.3 లక్షల వరకు ఆఫర్లు ఇస్తోంది. ఈ ఆఫర్లు ఈ నెల 30 వరకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
ఏ మోడల్‌పై ఎంత?
అల్టురాస్ కారుపై అత్యధికంగా రూ.2.2 లక్షల క్యాష్ బ్యాక్ ఇస్తోంది మహీంద్రా. ఎక్స్ఛేంజీ ఆఫర్ కింద మరో రూ.50 వేలు, కార్పొరేట్ ఆఫర్ ద్వారా రూ.6,500, రూ.15 వేల విలువైన యాక్సెసిరీస్ ఉచితంగా పొందేందుకు వీలుంది.
స్కార్పియో.. మోడల్‌పై ఎక్స్ఛేంజీ ఆఫర్ కింద రూ.15 వేలు, కార్పొరేట్ ఆఫర్ రూ.4,500, రూ.17,042 విలువైన ఫ్రీ యాక్సెసిరీస్.

మోరాజో మోడల్‌కు..రూ.20 వేలు క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజీ ఆఫర్ రూ.15 వేలు, కార్పొరేట్ ఆఫర్ రూ.5,200 పొందొచ్చు
ఎక్స్‌యూవీ 500.. మోడల్‌పై క్యాష్ డిస్కౌంట్ రూ.36,800, ఎక్స్ఛేజీ బోనస్ రూ.20 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.9 వేలుగా నిర్ణయించింది కంపెనీ. రూ.15 వేల విలువైన యాక్సెసిరీస్ కూడా పొందొచ్చు.
ఎక్స్‌యూవీ 300పై కూడా.. రూ.5000 క్యాష్ బ్యాక్, రూ.25 వేల ఎక్స్ఛేంజీ బోనస్, రూ.4000 వేల కార్పొరేట్ డిస్కౌంట్, రూ.5 వేల విలువైన యాక్సెసిరీస్ పొందొచ్చు.
ఇవీ చదవండి: