ETV Bharat / business

సుఖమయ జీవనానికి తారకమంత్రం.. పొదుపు, పెట్టుబడి - షేర్​మార్కెట్

ఆధునిక కాలంలో సుఖమయ జీవనానికి పొదుపు అత్యవసరం. మన పొదుపుపై వడ్డీ వస్తోంటే.. అది ఇంకా మంచిది. మరి నష్టభయం​ లేని సులభ మార్గాల్లో పొదుపు చేసే, పెట్టుబడులు పెట్టే మార్గాల గురించి తెలుసుకుందామా..

సుఖమయ జీవనానికి తారకమంత్రం.. పొదుపు, పెట్టుబడి
author img

By

Published : Sep 30, 2019, 6:00 AM IST

Updated : Oct 2, 2019, 1:14 PM IST

అమ్మ పోపు డబ్బాల్లో చిల్లర దాయడం, అత్యవసర సమయాల్లో వాటిని వినియోగించడం చిన్నతనంలో మీరు చేసే ఉంటారు. పొదుపు అనే పక్రియకు బీజం పడేది అక్కడి నుంచే. అయితే సరైన చోట మీరు సొమ్మును పెట్టుబడి పెడితే.. అటు పొదుపుతో పాటు మీకు వడ్డీల రూపంలో లాభమే లాభం.

కొంత మంది సరైన దిశానిర్దేశం లేక ఎక్కడపడితే అక్కడ పెట్టుబడులు పెట్టి సొమ్ము పోగొట్టుకుంటారు. మరికొందరు అసలు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. మరి ఎలా పొదుపు చేయాలో, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ పెట్టుబడి సూత్రాలు మీ కోసమే!

పెట్టిన పెట్టుబడికి ఎలాంటి రిస్క్​ లేకుండా అత్యధిక వడ్డీ రావాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇలా మీ పెట్టుబడికి రక్షణ కల్పిస్తూ అత్యధిక వడ్డీనిచ్చే మార్గాలవి:

1. స్టాక్​ మార్కెట్లు

స్టాక్​మార్కెట్​పై మంచి అవగాహన ఉంటే వారి బ్యాంకు ఖాతాలో సొమ్ము ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. ఎలాంటి షేర్​ ఎంచుకోవాలి, ఏ సమయంలో వాటాల అమ్మకాలు జరపాలి అనే విషయాలపై స్పష్టమైన అవగాహన అవసరం.

లాభాలు రావాలంటే

  • మార్కెట్లో నిపుణులకు కొదవ లేదు. ఎలాంటి నిపుణుడిని ఎన్నుకునారనే దానిపై మీకు వచ్చే లాభం ఆధారపడి ఉంటుంది.
  • సరైన అవగాహన లేకుండా... సొంత ప్రయోగాలు వద్దు.
  • మొదట కొద్దికొద్దిగా పెట్టుబడులు పెట్టాలి. అనుభవం గడించే కొద్దీ పెట్టుబడి పరిమితి పెంచుకుంటూపోవచ్చు.

2. మ్యూచువల్​ ఫండ్స్​

రిస్కు తక్కువ ఉన్న చోట పెట్టుబడి పెట్టాలనుకుంటే మ్యూచువల్​ ఫండ్స్​ను ప్రయత్నించవచ్చు. అయితే వీటిలో సూచీల ఆధారంగా వడ్డీ అందించే రిస్క్​ మ్యుూచువల్​ ఫండ్స్ ​(ఈక్విటీ ఫండ్స్​), రిస్క్​లేని ఫండ్స్​ (డెబిట్​ ఫండ్స్​) ఉంటాయి.

  • రిస్క్​ మ్యూచువల్​ ఫండ్స్​లో లాభ, నష్టాలు సమానంగా ఉంటాయి.
  • వివిధ సంస్థలు మ్యూచువల్​ ఫండ్స్​ అందిస్తున్నాయి. వీటిలో ఈక్విటీ, డెబిట్​ ఫండ్స్​ రెండూ ఉంటాయి.
  • అయితే పెట్టుబడికి డెబిట్​ ఫండ్స్​ ఎంచుకోవడమే ఉత్తమం.

3. జాతీయ పింఛను విధానం (ఎన్​పీఎస్​)

దీర్ఘకాల పెట్టుబడికి అత్యుత్తమ పథకం. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్​మెంట్ అథారిటీ దీనిని ప్రవేశపెట్టింది. ఇందులో రిస్క్​ అనే పదానికి స్థానం లేదు.

4. భవిష్య నిధి

పన్ను లేకుండా వడ్డీ అందుకునే ఏకైక మార్గం భవిష్య నిధిలో పెట్టుబడి. కేంద్రం భవిష్య నిధి పొదుపుపై వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

5. ఫిక్స్​డ్​ డిపాజిట్లు

సురక్షిత, హెచ్చు వడ్డీ రేట్లు బ్యాంకు ఫిక్స్​డ్​ డిపాజిట్ల ప్రత్యేకత. ఫిక్స్​డ్​ డిపాజిట్​ మొత్తానికి గరిష్ఠంగా లక్ష వరకు బీమా సౌకర్యమూ కల్పిస్తున్నాయి బ్యాంకులు. అవసరానికి అనుగుణంగా నెలవారీ, త్రైమాసిక, అర్ధ-వార్షిక, వార్షిక, అంతకంటే ఎక్కువ సమయం ఫిక్స్​డ్​ డిపాజిట్ చేసుకోవచ్చు.

6. సీనియర్ సిటిజన్స్ పొదుపు పథకం

పదవీ విరమణ చేసిన వారు, వృద్ధులు పొదుపు చేసేందుకు మొదటగా ఎంచుకునేది ఈ పథకాన్నే. 60 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు ఇందులో చేరవచ్చు. పోస్టల్​ లేదా బ్యాంకుల్లో దీనికి సంబంధించిన ఖాతా తెరవచ్చు. ఈ పథకం కింద దాచిన సొమ్ముకు 8.33 శాతం వడ్డీ లభిస్తుంది.

7. ఆర్​బీఐ బాండ్లు

ఏడు సంవత్సరాల కాలానికి ఆర్​బీఐ పన్నుతో కూడిన బాండ్లు విడుదల చేస్తుంది. వీటిలో పెట్టుబడి పెడితే... పన్ను కట్టి దేశాభివృద్ధికి సహాయ పడడమే కాదు... అధిక వడ్డీ పొందే అవకాశముంది. ప్రస్తుతం ఆర్​బీఐ 7.75 శాతం వడ్డీ ఇస్తోంది.

8. స్థిరాస్తి రంగం

తక్కువ కాలంలో అత్యధిక లాభాన్నిచ్చేది స్థిరాస్థి రంగం. అయితే ఈ రంగంలో ఆటుపోట్లు ఎక్కువ. ప్రస్తుతం నివాస గృహాలకు డిమాండ్​ అధికంగా ఉండటం, నిర్మాణ రంగంపై జీఎస్టీ రేట్లు తగ్గిస్తూ జీఎస్టీ మండలి తీసుకున్న నిర్ణయాలతో ఈ రంగం జోరు మీద ఉంది. అయితే ఇదే పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయని చెప్పలేము.

9. బంగారం

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెపాల్సిన అవసరం లేదు. ఇది రిస్క్​లేని పెట్టుబడి. డిమాండ్​ ఎప్పుడూ ఉంటుంది. అయితే కొంతకాలం తరువాత అరుగు, తరుగు అంటూ పెట్టుబడిలో కోత పడే ప్రమాదముంది. దీనికి ఓ పరిష్కార మార్గముంది. అదే రిజర్వ్​ బ్యాంకు సావరిన్​ గోల్డ్​ బాండ్లు. సావరిన్​ గోల్డ్​ బాండ్ల పెట్టుబడుల ఉపసంహరణ సమయంలో ఆ రోజు మార్కెట్​ ధర ప్రకారం ధర చెల్లిస్తుంది ఆర్​బీఐ.

ఇదీ చూడండి: పాక్ ప్రధాని భార్యకు అద్భుత శక్తి- అద్దంలో ఆమె కనిపించరట!

AP Video Delivery Log - 1300 GMT News
Sunday, 29 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1233: Vatican Pope Statue AP Clients Only 4232325
Pope attends Vatican migrant boat statue unveiling
AP-APTN-1230: France Chirac 2 AP Clients Only 4232329
Paris mourners wait to pay respects to Chirac
AP-APTN-1217: UK Conservatives Johnson 2 AP Clients Only 4232316
UK's Johnson on Brexit, Arcuri ahead of conference
AP-APTN-1202: Lebanon Protest 2 AP Clients Only 4232324
Dozens of protesters close roads in Beirut
AP-APTN-1156: Vatican Pope Cameroon AP Clients Only 4232323
Pope Francis hopes for peace in Cameroon
AP-APTN-1153: Hong Kong Clashes 2 AP Clients Only 4232319
HK protesters, police clash for second straight day
AP-APTN-1153: Afghanistan Air Strike AP Clients Only 4232318
Official: protesters allege US strike killed 5 Afghans
AP-APTN-1152: India Floods AP Clients Only 4232321
Monsoon rains, floods continue in Uttar Pradesh
AP-APTN-1151: France Chirac AP Clients Only 4232320
Chirac coffin arrives for mourners to pay respects
AP-APTN-1121: UK Conservatives Johnson AP Clients Only 4232313
UK PM Johnson arrives at Conservative conference
AP-APTN-1121: UNGA Yemen AP Clients Only 4232277
Yemen FM hits out at Houthi militia, Iran, UAE
AP-APTN-1116: Taiwan HKong Rally Part no access Taiwan 4232314
Thousands march in Taiwan supporting HK demos
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 1:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.