పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కళ్లెం పడే సూచనలు కనిపించడంలేదు. వరుసగా 19వ రోజు కూడా చమురు ధరలు భగ్గుమన్నాయి. గురువారం డీజిల్‌పై 14 పైసలు, పెట్రోలుపై 16 పైసలు పెంచినట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దిల్లీలో లీటరు డీజిల్ ధర రూ.80.02కు చేరగా.. పెట్రోల్ ధర రూ.79.92కు చేరింది.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో స్థానిక పన్నులు, వ్యాట్‌లలో వ్యత్యాసం వల్ల.... పెట్రోల్, డీజిల్ ధరలు దిల్లీలో కన్నా ఎక్కువగానో లేదా తక్కువగానో ఉంటున్నాయి. తాజా సవరణతో ఇతర నగరాల కన్నా దిల్లీలో డీజిల్ ధర అధికం కాగా పెట్రోల్ ధర మాత్రం తక్కువగా ఉంది.
19 రోజుల్లో రూ.10.63
గత 19 రోజుల వరుస సవరణలతో లీటర్ డీజిల్ ధర రూ.10.63.. లీటర్ పెట్రోల్ ధర రూ. 8.21 పెరిగింది.
ఇదీ చూడండి: 'గగన్యాన్ సహా 10 ప్రయోగాలపై లాక్డౌన్ ఎఫెక్ట్'