ETV Bharat / business

'భూమిని ప్లాట్లుగా విక్రయించినా.. జీఎస్టీ కట్టాల్సిందే' - భూ విక్రయాలపై జీఎస్టీ

అభివృద్ధి చేసిన భూమిని తిరిగి ప్లాట్లుగా విక్రయిస్తే.. వాటికి కూడా కచ్చితంగా జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) తెలిపింది. అలాగే విద్యుత్, వాటర్​లైన్, డ్రైనేజీ లాంటి మౌలిక సౌకర్యాల కోసం భూమిని బదలాయించినా.. జీఎస్టీ కట్టాల్సిందేనని స్పష్టం చేసింది.

Developed land sold as plots will attract GST: AAR
భూమిని ప్లాటులుగా విక్రయిస్తే.. జీఎస్టీ కట్టాల్సిందే: ఏఏఆర్​
author img

By

Published : Jun 21, 2020, 10:56 PM IST

రియల్ ఎస్టేట్ డెవలపర్​ అభివృద్ధి చేసి ఇచ్చిన భూమిని తిరిగి ప్లాట్లుగా చేసి విక్రయిస్తే.. వాటికి కూడా జీఎస్టీ కట్టాల్సి ఉంటుందని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్(ఏఏఆర్​) స్పష్టం చేసింది. ప్రాథమిక సౌకర్యాలైన విద్యుత్​, వాటర్​లైన్​, డ్రైనేజీల కోసం భూమి విక్రయించినా జీఎస్​టీ తప్పదని పేర్కొంది.

అభివృద్ధి చేసిన ప్లాట్ల అమ్మకం అనేది.. 'కొనుగోలుదారుడికి విక్రయించేందుకు ఉద్దేశించిన కాంప్లెక్స్ నిర్మాణం' అనే నిబంధన పరిధిలో ఉంటుందని.. దానికి అనుగుణంగానే జీఎస్టీ కట్టాలని ఏఏఆర్ తేల్చిచెప్పింది.

భూముల అమ్మకంపై వస్తు, సేవల పన్ను వర్తిస్తుందా? అంటూ ఓ దరఖాస్తుదారుడు ఏఏఆర్​ గుజరాత్ బెంచ్​ను సంప్రదించాడు. ప్రాథమిక సౌకర్యాలు అయిన డ్రైనేజీ, వాటర్ లైన్​, విద్యుత్ లైన్, ల్యాండ్ లెవలింగ్ మొదలైన వాటి కోసం విక్రయం జరిపినప్పుడు కూడా జీఎస్టీ కట్టాల్సి ఉంటుందా? అని ప్రశ్నించాడు. దీనికి 'జీఎస్టీ చెల్లించాల్సిందే' అని ఏఏఆర్ స్పష్టం చేసింది.

దామాషా ప్రకారం

భూమిని ప్లాటులుగా చేసి విక్రయించాలనుకుంటే... భూమి ధరతో పాటు, ప్రాథమిక సౌకర్యాల కల్పన కోసం పెట్టిన ఖర్చులు కూడా కలిపే అమ్ముతారు. అందువల్ల వాటికి కూడా జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.

'ఇలాగైతే చాలా కష్టం'

ఏఏఆర్ తీర్పు... మొత్తం రియల్ ఎస్టేట్ రంగంపై ప్రత్యక్ష, తక్షణ, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని.. ఏఎంఆర్​జీ అండ్ అసోసియేట్స్ సీనియర్ భాగస్వామి​ రజత్ మోహన్ అభిప్రాయపడ్డారు.

ఏఏఆర్ తీర్పు జీఎస్టీ ప్రాథమిక నిబంధనలకు విరుద్ధంగా ఉందని రజత్ మోహన్ పేర్కొన్నారు. ముఖ్యంగా అభివృద్ధి చేసిన ప్లాట్ల అమ్మకాలకు ఇచ్చే 'టాక్స్ న్యూట్రల్ స్టేటస్ అవార్డు' కోల్పోవలసి వస్తుందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగం పరంగానూ, స్థిరమైన ఆస్తిలో చేసే లావాదేవీలపై జీఎస్టీ విధించడానికి వీలుండదని అన్నారు.

ఐటీసీ

ఉద్యోగుల రవాణా కోసం వాణిజ్య వాహనాలను అద్దెకు తీసుకునేటప్పుడు చెల్లించే జీఎస్టీకి.. కంపెనీలు ఇన్​పుట్ టాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేయలేవు. అంటే ఉద్యోగులకు రవాణా సౌకర్యం కల్పించడం.. ఏ చట్టం ప్రకారం తప్పనిసరి కాదని ఏఏఆర్ స్పష్టం చేస్తోంది.

సిమ్లాలోని ప్రసార భారతి బ్రాడ్​కాస్టింగ్ కార్పొరేషన్ వేసిన దరఖాస్తుపై... ఏఏఆర్ ఈ విధంగా తీర్పు వెలువరించింది.

ఇదీ చూడండి: షాపింగ్స్​ మాల్స్ తెరిచినా కొనేవాళ్లు కరవు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.