ETV Bharat / business

కరోనా రెండో దశతో 'గుడ్డు'కు భలే గిరాకీ

కొవిడ్ రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో కోడిగుడ్లకు గిరాకీ భారీగా పెరిగిందని ప్రభుత్వ అధికారులు, నిపుణులు వెల్లడించారు. రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు ప్రజలు మళ్లీ గుడ్ల వినియోగం పెంచారని తెలిపారు. ఇదే సమయంలో కోళ్ల దాణా వ్యయాలు పెరిగిపోవడం వల్ల గుడ్ల రిటైల్‌ ధరలు ఆయా ప్రాంతాల ఆధారంగా రూ.6-7 వరకు పెరిగాయి.

eggs, demand
గుడ్లు, కోడిగుడ్లు
author img

By

Published : Jun 13, 2021, 10:15 AM IST

కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో కోడిగుడ్లకు గిరాకీ విపరీతంగా పెరిగినట్లు ప్రభుత్వ అధికారులు, పరిశ్రమ నిపుణులు వెల్లడించారు. గత జనవరి-ఫిబ్రవరిలో బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తోందనే ప్రచారంతో ఒక్కసారిగా గుడ్ల వినియోగాన్ని ప్రజలు తగ్గించారు. అయితే కొవిడ్‌ మహమ్మారి విజృంభించడంతో, రోగ నిరోధకత పెంచుకునేందుకు మళ్లీ గుడ్ల వినియోగం పెంచారు. ఒకపక్క లాక్‌డౌన్, కర్ఫ్యూ ఆంక్షలు, కార్మికుల కొరత వల్ల సరఫరా ఇబ్బందులున్న ప్రస్తుత సమయంలో గిరాకీ పుంజుకుంది. ఇదే సమయంలో కోళ్ల దాణా వ్యయాలు పెరిగిపోవడంతో గుడ్ల రిటైల్‌ ధరలు ఆయా ప్రాంతాల ఆధారంగా రూ.6-7 వరకు పెరిగాయి.

  • కొవిడ్‌-19 రోగులకు అధికంగా ప్రోటీన్లు లభించే ఆహారం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ తక్కువ ధరలో ప్రోటీన్లు అందేందుకు గుడ్లు సులభ మార్గమని నిపుణులు చెబుతున్నారు.
  • 'కొన్ని నెలలుగా గుడ్ల వినియోగం బాగా పెరిగింది. వీటిలో అత్యధికంగా 11 శాతం ప్రోటీన్‌ కంటెంట్‌ ఉంటుంద'ని పశు సంవర్థక, పౌల్ట్రీ, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రెటరీ ఓపీ చౌధరి వెల్లడించారు.
  • నెలవారీగా గుడ్ల వినియోగం పెరుగుదలను అంచనా వేయడం కష్టమని మరో అధికారి పేర్కొన్నారు. 2018-19లో ఒక వ్యక్తి సగటు వార్షిక వినియోగం 79 గుడ్లు కాగా, 2019-20కి అది 86 గుడ్లకు చేరిందని వివరించారు.

లాక్‌డౌన్‌ ప్రభావం ఇలా

2020 ఏప్రిల్‌-మేలో విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో కోళ్ల పరిశ్రమ భారీగా దెబ్బతిందని ఇండియన్‌ బ్రాయిలర్‌ గ్రూప్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గుల్రేజ్‌ ఆలమ్‌ వెల్లడించారు. అప్పుడు గుడ్లు, చికెన్‌కు గిరాకీ కూడా తగ్గిదని తెలిపారు. జూన్‌-డిసెంబరులో మళ్లీ గిరాకీ పుంజుకుందన్నారు. ఈ ఏడాదికొస్తే జనవరి-ఫిబ్రవరిలో మళ్లీ గిరాకీపై బర్డ్‌ఫ్లూ ప్రభావం పడిందని తెలిపారు. గత ఏడాది జూన్‌లో ఒక వ్యక్తి నెలవారీగా సగటున 7 గుడ్లు తినగా, ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో బర్డ్‌ఫ్లూ భయాలతో సరాసరిన 4 గుడ్లు మాత్రమే వినియోగించారని వివరించారు. ఈ ఏడాది ‘మార్చి తర్వాత గిరాకీ మళ్లీ పుంజుకుంది. కొవిడ్‌ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో వినియోగం పెరిగి, మళ్లీ నెలకు 7 గుడ్ల స్థాయికి చేరింద’ని ఆలమ్‌ తెలిపారు.

పట్టణాల్లో అధిక గిరాకీ

'గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో గుడ్లకు గిరాకీ ఎక్కువగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో గిరాకీ పెరిగినపుడే ధరలు అధికమవుతాయ'ని జాతీయ కోడిగుడ్ల సమన్వయ కమిటీ (నెక్‌) జోనల్‌ ఛైర్మన్‌ ప్రవీణ్‌ గార్గ్‌ వివరించారు. కోడిగుడ్డు ధరలో, మరే ఆహారం ద్వారా ఇంత మొత్తం ప్రోటీన్‌ లభించదు. అందుకే గుడ్లకు గిరాకీ బాగా పెరిగిపోతోంది. కోళ్ల ఫారాలు పూర్తి సిబ్బందితో నిర్వహించలేకపోతుండటం, దాణా వ్యయాలు పెరిగిపోవండతో గుడ్ల సరఫరా కష్టంగా మారింద’ని వెంకీస్‌ జనరల్‌ మేనేజర్‌ ప్రసన్న తెలిపారు.

98 శాతం దేశంలోనే వినియోగం

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, దేశంలో గుడ్ల ఉత్పత్తి 2018-19తో పోలిస్తే (10,300 కోట్లు) 2019-20కి (14,000 కోట్లు) బాగా పెరిగింది. అలాగే వీటిలో 98 శాతం గుడ్ల వినియోగం దేశంలోనే జరుగుతోంది.

  • 'రోజుకు రెండు గుడ్లు తీసుకుంటే శరీరానికి కావాల్సిన విటమిన్‌ డి, బీ12, ఇతర విటమిన్లు లభిస్తాయ'ని ఎగోజ్‌ బ్రాండ్‌ పేరుతో గుడ్ల వ్యాపారంలో ఉన్న గురుగ్రామ్‌కు చెందిన అంకుర సంస్థ సహవ్యవస్థాపకులు అభిషేక్‌ నేగి వెల్లడించారు. సాధారణంగా హరియాణాలో ఒక్కో గుడ్డుకు రైతుకు రూ.3-3.50 లభిస్తుండగా, అది ఈ ఏడాది ఏప్రిల్‌-మే నెలల్లో గరిష్ఠంగా రూ.5.50కు చేరింది. ఇప్పుడు రూ.4.80 దక్కుతోందని అభిషేక్‌ తెలిపారు. విపణిలో ప్యాకింగ్‌ లేని గుడ్లు రిటైల్‌గా రూ.6-7కు విక్రయిస్తుండగా, బ్రాండెడ్‌ గుడ్లను రూ.10 అంతకంటే ఎక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:కొవిడ్​ వల్ల కొండెక్కిన ధరలు.. కొనాలంటే 'గుడ్లు' తేలేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.