ETV Bharat / business

రిలయన్స్​-ఫ్యూచర్​ ఒప్పందానికి దిల్లీ హైకోర్టు బ్రేకులు - దిల్లీ హైకోర్టు

రిలయన్స్​ రిటైల్​తో ఒప్పందంలో ఏ మాత్రం ముందుకెళ్లొద్దని ఫ్యూచర్​ గ్రూప్​ను ఆదేశించింది దిల్లీ హైకోర్టు. సింగపూర్​ ఆర్బిట్రేషన్​ ప్యానెల్​ తీర్పును సమర్థించింది. ప్యానెల్​ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు పేర్కొంది.

Future group
దిల్లీ హైకోర్టులో ఫ్యూచర్​ గ్రూప్​కు ఎదురుదెబ్బ
author img

By

Published : Mar 18, 2021, 6:44 PM IST

రిలయన్స్​ రిటైల్​తో ప్యూచర్​ గ్రూపు కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంలో సింగపూర్​ ఆర్బిట్రేషన్​ ప్యానెల్​ తీర్పును సమర్థించింది దిల్లీ హైకోర్టు. ఒప్పందం జరగకుండా చూడాలని స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన ఈ-కామర్స్​ సంస్థ అమెజాన్​ పిటిషన్​పై ఈ మేరకు తీర్పు వెలువరించింది కోర్టు.

కిశోర్​ బియాని నేతృత్వంలోని ఫ్యూచర్​ గ్రూపు ఈ ఒప్పందంలో ముందుకు వెళ్లొద్దని ఆదేశించారు జస్టిస్​ ఆర్​ జే మిధా. ఎఫ్​ఆర్​ఎల్​ సింగపూర్​ ఆర్బిట్రేటర్స్​ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.

ఫ్యూచర్​ గ్రూప్​, దాని డైరెక్టర్లు రూ. 20 లక్షలు.. బీపీఎల్​ కుటుంబాల్లోని వయోవృద్ధులకు కొవిడ్​-19 టీకా అందించేందుకు పీఎంఆర్ఎఫ్​ నిధికి అందించాలని ఆదేశించింది హైకోర్టు. అలాగే.. బియానీ సహా ఇతర సంబంధితులు తమ ఆస్తుల వివరాలతో ఏప్రిల్​ 28న కోర్టు ముందు హాజరుకావాలని స్పష్టం చేసింది. అత్యవసర ఆర్బిట్రేటర్స్​ ఆదేశాలను ఉల్లంఘించినందుకు 3 నెలల పాటు ఎందుకు జైలులో పెట్టకూడదో వివరించాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: 'రిలయన్స్, ఫ్యూచర్​ మధ్య నారదుడిలా బెజోస్!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.