ETV Bharat / business

ఐటీ రిటర్న్స్‌ గడువు పొడిగింపు - ఆదాయపన్ను గడువు పొడిగింపు

2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపన్ను చెల్లింపు గడువును కేంద్రం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత చెల్లింపులకు మరో 10 రోజులు గడువిచ్చింది. కంపెనీల ఐటీ రిటర్నుల దాఖలుకు 15 రోజులు గడువు పెంచింది.

Deadline for filing IT returns by individuals extended till January 10: Finance Ministry
ఐటీ రిటర్న్స్‌ గడువు పొడిగింపు
author img

By

Published : Dec 30, 2020, 7:13 PM IST

Updated : Dec 30, 2020, 7:27 PM IST

ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించిన గడువును కేంద్రం మరోసారి పొడగించింది. 2019-20 ఆర్థిక ఏడాదిలో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 10 రోజులు గడువిస్తూ నిర్ణయం తీసుకుంది. జనవరి 10వరకు రిటర్న్స్ దాఖలు చేసేలా వెసులుబాటు కల్పించింది. మరోవైపు కంపెనీల ఐటీ రిటర్నుల దాఖలుకు 15 రోజులు గడువు పెంచింది. ఫిబ్రవరి 15లోపు రిటర్నులు దాఖలు చేసుకునే వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన జారీ చేసింది.

అంతకుముందు వ్యక్తిగత పన్ను చెల్లింపు దారులకు ఈ నెల 31 వరకు, కంపెనీలకు జనవరి 31 వరకు ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలుకు గడువు విధించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈ నెల 28 వరకు 4.54 కోట్ల ఐటీ రిటర్నులు దాఖలైనట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. కొవిడ్19 నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

దీనితో పాటు వివాద పరిష్కార పథకం 'వివాద్సే విశ్వాస్'​ గడువును జనవరి 31 వరకు పొడగించినట్లు తెలిపింది. మరోవైపు 2019 ఆర్థిక సంవత్సరానికి జీఎస్టీ వార్షిక రిటర్నులు కూడా ఫిబ్రవరి 28 వరకు రెండు నెలల పాటు పొడిగించింది.

ఇదీ చూడండి: 31 ఆఖరు- 4.15 కోట్ల ఐటీఆర్​లు దాఖలు

Last Updated : Dec 30, 2020, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.