కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వైద్యానికి సంబంధించిన రిఫ్రిజిరేటర్లకు ఎక్కువ డిమాండ్ ఏర్పడినట్లు వాటిని ఉత్పత్తి చేసే కంపెనీల చెబుతున్నాయి. అయితే ప్రముఖ తయారీదారులైన గోద్రేజ్, వోల్టాస్, బ్లూస్టార్ సంస్థలు ప్రస్తుతం మార్కెట్ అవసరాలను తీర్చే విధంగా అతి శీతలీకరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటున్నాయి. టీకాలను ఉత్పత్తి చేసే ప్రమఖ కంపెనీలను ఈ రిఫ్రిజిరేటర్ ఉత్పత్తి సంస్థలు ముఖ్య వినియోగదారులుగా మార్చుకుంటున్నారు.
టీకాలు నిల్వ ఉంచడానికి అనువుగా ఉంటే రిఫ్రిజిరేటర్లకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఉత్పత్తి సామర్థాన్ని పెంచుకోవాలని చూస్తున్నాయి. మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతతో పని చేయగల వాటిని కొత్తగా తయారు చేయనున్నారు.
భారత్లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ లాంటి టీకాలను అనుమతి లభించి.. టీకా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తరువాత తమ వ్యాపారాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయని ఆయా రిఫ్రిజిరేటర్ ఉత్పత్తి సంస్థలు తెలిపాయి. అయితే ఇప్పుడు కొవిడ్ వ్యాక్సిన్లను దిగుమితి చేసుకుంటున్న ప్రముఖ ఫార్మా కంపెనీలతో సరాసరి సంబంధాలు ఏర్పర్చుకుంటున్నట్లు చెప్పాయి.
మెడికల్ రిఫ్రిజిరేటర్ల తయారీరంగంలో పెద్దన్నగా ఉంటున్న గ్రోద్రేజ్ గ్రూప్ ఇప్పటికే ఫైజర్ టీకా ఉత్పత్తిదారులతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ఫైజర్ వ్యాక్సిన్ టీకా నిల్వకు అనుకూలంగా ఉండేలా మైనస్ 80డిగ్రీల సెల్సియస్ రిఫ్రిజిరేటర్లను అందించనుంది. అంతేగాక మోడెర్నా నుంచి ఇప్పటికే 10వేల యూనిట్లు కావాలంటూ ఆర్డర్ వచ్చిందని గోద్రేజ్ సంస్థ తెలిపింది.
అత్యంత శీతలీకరణ యంత్రాలను ఉత్పత్తి చేయడానికిగాను టాటా గ్రూప్ అయిన ఓల్టాస్ విదేశీ భాగస్వాములతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాయి.
ఇదీ చూడండి: ఏసీలు, రిఫ్రిజిరేటర్ల అమ్మకాలపై కొవిడ్ దెబ్బ