ETV Bharat / business

IT COMPANIES: ఐటీ కంపెనీలను వెంటాడుతున్న కొవిడ్​ థర్డ్​ వేవ్​ భయాలు - telangana varthalu

కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ఎత్తివేత, ఆంక్షల సడలింపు వేగవంతమైంది. దీంతో ఆయా రంగాలు ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నాయి. పోస్ట్ కొవిడ్ పరిస్థితుల్లో ఇంకా పూర్తిస్థాయిలో తెరుచుకోనివి ఐటీ కంపెనీలే. రీఓపెన్ దిశగా అడుగులేస్తోన్న ఐటీ కంపెనీలకు.. కొవిడ్ థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్ విజృంభణ భయాలు వెంటాడుతున్నాయి. సెప్టెంబర్ కల్లా 50 శాతం వర్క్ ఫోర్స్​తో ఆపరేట్ చేద్దామనుకున్న కంపెనీలు తిరిగి పునరాలోచనలో పడుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ రీఓపెన్ దిశగా అడుగులు వేసినా.. ఉద్యోగుల్లో వ్యాక్సినేషన్ స్టేటస్, హైబ్రిడ్ మోడల్ పనివిధానాలు, కొవిడ్ టాకిల్ మేనేజ్ మెంట్ విధానాలు, మొత్తం ఉద్యోగుల్లో నిర్దిష్టమైన శాతం మందిని ఇంటి నుంచే పనిచేసేలా కార్యాచరణకు ప్రణాళికలు రచిస్తున్నారు.

IT COMPANIES: ఐటీ కంపెనీలను వెంటాడుతున్న కొవిడ్​ థర్డ్​ వేవ్​ భయాలు

author img

By

Published : Jul 25, 2021, 9:55 AM IST

తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్య రంగాల్లో ఐటీ ముందజలో ఉంటుంది. రాష్ట్రంలో మొత్తం ఆరున్నర లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉండగా.. ఈరంగంపై ఆధారపడిన అనుబంధ రంగాలతో కలిపి మొత్తంగా 20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంతటి ప్రాధాన్య రంగం ఇప్పుడు ఇంటి నుంచి పనికి పరిమితమైంది. గత రెండేళ్లుగా వర్క్ ఫ్రం హోం చేస్తున్నా.. ప్రొడక్టివిటీ, ఎగుమతులు ఏమాత్రం తగ్గకపోగా జాతీయ సగటును మించిన వృద్ధిని రాష్ట్ర ఐటీరంగం సాధించింది. ఈ ఏడాది ఐటీ రంగం 12.98 శాతం వృద్ధి సాధించింది. ఎగుమతులు సైతం లక్ష 45 వేల 522 కోట్లకు పెరిగాయి. 2020-21 సంవత్సరానికి గాను ఐటీ రంగం, అనుబంధ సేవల ద్వారా 7.99 శాతం ఉద్యోగిత పెరిగింది. ఏడాది కాలంలో కొత్తగా 46 వేల 489 ఉద్యోగాలను ఐటీ రంగం కల్పించింది. తద్వారా రాష్ట్రంలో మొత్తం ఐటీ ఉద్యోగుల సంఖ్య 6 లక్షల 28 వేల 615 కు చేరుకుంది. గతేడాది కాలంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, గోల్డ్​మ్యాన్​ సాచ్స్​, మాస్ మ్యూచువల్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబాద్​లో కార్యకలాపాలు ప్రారంభించాయి.

హైదరాబాద్​లోనే మెరుగ్గా పరిస్థితులు

కొవిడ్ మొదటి వేవ్ నుంచి ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తూ వస్తున్నారు. ఇప్పటికీ రెండేళ్ల తర్వాత కూడా కంపెనీల నుంచి పని చేసే ఉద్యోగులు 3 నుంచి 5 శాతానికే పరిమితమయ్యారు. ఐటీ వృద్ధి అధికంగా ఉండే బెంగళూరు, చెన్నై నగరాల కన్నా.. హైదరాబాద్​లోనే పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. సెకండ్ వేవ్ ఆంక్షల సడలింపుతో చిన్న, మధ్యతరగతి కంపెనీలు ఉద్యోగులను కార్యాలయాలకు ఆహ్వానించగా.. పెద్ద కంపెనీలు, జీఐసీ కంపెనీలు ఇంకా వేచి చూసే ధోరణిలోనే ఉన్నాయి. అయితే కంపెనీలన్నీ జులై మొదలుకొని ఈ ఏడాది డిసెంబర్ కల్లా 75 శాతం వర్క్ ఫోర్స్​తో ఆపరేట్ చేయాలని యాజమాన్యాలు సంకల్పించాయి. ప్రస్తుతం థర్డ్ వేవ్ భయాలు, డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు పిలిచేందుకు కంపెనీలు పునరాలోచనలో పడినట్లు నిపుణులు తెలిపారు. ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చే ప్రాతిపదిక వ్యాక్సినేషన్ స్టేటస్​పై ఆధారపడి ఉంటుందని.. ఈ అక్టోబర్ కల్లా ఐటీ ఉద్యోగుల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తి చేసేందుకు ఐటీ కంపెనీలు చొరవ తీసుకున్నాయని వారంటున్నారు.

హైబ్రిడ్ మోడల్​ను అవలంభించేందుకు..

ఉద్యోగులను ఆఫీసులకు రాకపోవటం వల్ల ప్రొడక్టివిటీ తగ్గకపోయినా.. కొన్ని సమస్యలున్నాయి. ముఖ్యంగా కొత్తగా చేరే వారికి ట్రైనింగ్, మెంటరింగ్ చేయటం యాజమాన్యాలకు కష్టసాధ్యమవుతోంది. కొవిడ్ క్లిష్ట పరిస్థితుల్లోనూ లక్ష నుంచి లక్షా 20 వేల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని పెద్ద కంపెనీలు ఇప్పటికే ప్రకటించాయి. నియామక ప్రక్రియ అంతా ఆన్​లైన్​లోనే కొనసాగుతోంది. దీంతో వారికి వర్క్ అసెస్ మెంట్, మార్గదర్శనం, టీంలో కలిసి పనిచేసే అనుభవం కొరవడి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. బయట నుంచి వచ్చే ప్రాజెక్టులు, ఆర్డర్లలో కొరత లేకున్నా.. ఎగ్జిక్యూషన్, డెలివరీలో సవాళ్లు ఎదురవుతున్నాయని కొంతమంది ఉద్యోగులు తెలిపారు. ఈ నేపథ్యంలో వారంలో సగం రోజులైనా ఆపరేట్ అయ్యేలా హైబ్రిడ్ మోడల్​ను అవలంభించేందుకు కంపెనీలు సమాయత్తమవుతున్నాయి. ఉద్యోగులు ఆఫీసులకు వచ్చే లోగా కొవిడ్ టాకిల్ మేనేజ్​మెంట్ ఎన్విరాన్ మెంట్​ను సిద్ధం చేస్తున్నాయి.

ఇంటి నుంచే పనికి మొగ్గు

ప్రభుత్వం, కంపెనీలు కూడా ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు రావాలనే కోరుకుంటున్నాయి. కానీ థర్డ్ వేవ్ భయాలతో వెనకడుగేస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం వల్ల ఉద్యోగుల్లో ఒత్తిళ్లు పెరిగాయి. ఒకవేళ ఉద్యోగులను ఆఫీసులకు తిరిగి ఆహ్వానిస్తే హైబ్రిడ్ మోడళ్లను అమలు చేసేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. పరిస్థితులు సానుకూలంగా ఉండి ఉద్యోగులు కార్యాలయాలకు జులై నుంచి క్రమంగా ప్రారంభించినా.. ఈ ఏడాది డిసెంబర్ వరకు కూడా 20 నుంచి 30 శాతం మాత్రమే ఆఫీస్ నుంచి ఆపరేట్ అయ్యే అవకాశాలున్నాయి. మరో 25 - 30 శాతం ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన ఇంటి నుంచే పనికి కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. -భరణి కుమార్ అరోల్, హైదరాబాద్ ఎంటర్ ప్రైజెస్ అసోసియేషన్ అధ్యక్షులు

IT COMPANIES: ఐటీ కంపెనీలను వెంటాడుతున్న కొవిడ్​ థర్డ్​ వేవ్​ భయాలు

ఇదీ చదవండి: BUSINESS IN LOCKDOWN PERIOD: కరోనా కాలంలో... దారి మార్చారు దూసుకెళ్లారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.