ETV Bharat / business

ఫైజర్​ టీకా.. ఒక్కో దేశంలో ఒక్కో ధర - కరోనా వ్యాక్సిన్​ ఫైజర్​

ఫైజర్​ వ్యాక్సిన్​ను ఒక్కో దేశంలో ఒక్కో ధరకు అమ్మేందుకు నిర్ణయించినట్టు ఆ సంస్థ సీఈఓ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా టీకా అందుబాటులో ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

COVID-19 vaccine to have differential pricing: Pfizer
ఫైజర్​ టీకా.. ఒక్కో దేశంలో ఒక్కో ధర
author img

By

Published : Dec 9, 2020, 7:40 PM IST

తాము అభివృద్ధి చేస్తున్న కరోనా టీకాకు ఒక్కో దేశంలో ఒక్కో ధర ఉంటుందని అంతర్జాతీయ ఫార్మా సంస్థ పైజర్​ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా టీకా అందుబాటులో ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు.. ఐఎఫ్​పీఎమ్​ఏ(ఇంటర్నేషనల్​ ఫెడరేషన్​ ఆఫ్​ ఫార్మాస్యూటికల్​ మ్యానుఫ్యాక్చరర్స్​ అండ్​ అసోసియేషన్స్​) నిర్వహించిన ఓ ఆన్​లైన్​ కార్యక్రమంలో వెల్లడించారు ఫైజర్​ సీఈఓ ఆల్బర్ట్​ బౌర్ల.

"ఒక్కో దేశంలో ఒక్కో ధరకు ఫైజర్​ టీకాను అమ్ముతాం. అభివృద్ధి చెందిన దేశంలో.. జీడీపీ ఆధారంగా టీకా ధర ఉంటుంది. ఆదాయం మధ్యస్తంగా ఉండే దేశాల్లో ధర తక్కువగా ఉంటుంది. ఆఫ్రికా వంటి అల్పాదాయ దేశాలకు.. ఎలాంటి లాభాలను ఆశించకుండానే వ్యాక్సిన్​ను అందిస్తాము."

-- ఆల్బర్ట్​ బౌర్ల, ఫైజర్​ సీఈఓ.

వివిధ దేశాల ప్రభుత్వాలతో తమ కంపెనీ చర్చలు జరుపుతోందని వెల్లడించారు ఫైజర్​ సీఈఓ.

భారత్​లో టీకా అత్యవసర వినియోగానికి అనుమతుల కోసం ఫైజర్​ ఇప్పటికే దరఖాస్తు చేసుకుంది. కాగా.. బ్రిటన్​లో ఇప్పటికే ప్రజలకు టీకాను పంపిణీ చేస్తున్నారు.

ఇదీ చూడండి- కరోనా టీకాలకు త్వరలోనే అనుమతి: కేంద్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.