ETV Bharat / business

ఎన్​డీఆర్​ఎఫ్​ నిధులతో వైద్యసిబ్బంది బీమా పథకం - INSURANCE COVER to healthcare providers

కరోనా వైరస్​ను అడ్డుకునేందుకు కృషి చేస్తున్న సుమారు 22.12 లక్షల మంది వైద్యులు, ఇతర సిబ్బందికి రూ.50 లక్షల విలువైన వ్యక్తిగత బీమా పథకాన్ని 90 రోజుల పాటు కల్పిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ విపత్తు స్పందన దళం నిధుల ద్వారా దీనిని అమలు చేయాలని నిర్ణయించింది.

COVID-19
కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా
author img

By

Published : Mar 29, 2020, 6:05 AM IST

కరోనా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న సుమారు 22.12 లక్షల మంది వైద్యులు, ఇతర సిబ్బందికి రూ.50 లక్షల విలువైన బీమా కల్పిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 26న ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్​ ప్రకటించిన ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ యోజన కింద వారందరికి బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది.

" ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ యోజన కింద ప్రకటించిన నియమాల ప్రకారం కొవిడ్​-19ను అరికట్టేందుకు కృషి చేస్తున్న వారికి బీమా కల్పించే పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ విభాగాల్లోని వైద్య సిబ్బందితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది, పదవీ విరమణ పొందిన సిబ్బంది, వలంటీర్లు, కాంట్రాక్టు వర్కర్లు, రోజువారి కూలీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆరోగ్య సంస్థల్లోని ఔట్​సోర్సింగ్​ సిబ్బందికీ ఈ పథకం వర్తిస్తుంది."

- కేంద్ర ఆరోగ్య శాఖ.

ఎన్​డీఆర్​ఎఫ్​ నిధులతో..

దేశంలోని సుమారు 22.12 లక్షల మంది వైద్య సిబ్బందికి 90 రోజుల పాటు రూ. 50 లక్షల విలువైన వ్యక్తిగత ప్రమాద బీమా వర్తిస్తుందని స్పష్టం చేసింది కేంద్రం. బీమా కల్పన పథకాన్ని జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్​డీఆర్​ఎఫ్​) నిధుల ద్వారా అమలుచేయాలని నిర్ణయించింది. ఈ సిబ్బందికి ఇప్పటికే వర్తించే బీమాలకు ఇది అదనమని పేర్కొంది.

ఇదీ చూడండి: కరోనా ఎలా ఉంటుందో తెలుసా?.. ఈ చిత్రాల్లో చూడండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.