ETV Bharat / business

2 లక్షల 'ఆటో' ఉద్యోగాలకు కరోనా గండం! - వాహన రంగంలో భారీగా ఉద్యోగాల కోత

కరోనా సంక్షోభం వాహన రంగ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. మరో నెలలో వాహన రంగంలో డిమాండ్ పుంజుకోకపోతే.. డీలర్​షిప్​లలో భారీగా ఉద్యోగాల కోత తప్పకపోవచ్చని.. ఆటో మోబైల్స్ డీలర్స్ సమాఖ్య 'ఫాడా' అందోళన వ్యక్తం చేసింది.

corona crisis on Auto sector
వాహన రంగ ఉద్యోగులకు కరోనా గండం
author img

By

Published : Jun 14, 2020, 3:44 PM IST

కరోనా మహమ్మారి సృష్టించిన సంక్షోభంతో వాహన డీలర్​షిప్​లలో భారీగా ఉద్యోగాలు పోయే ప్రమాదం ఏర్పడినట్లు ఆటోమోబైల్​ డీలర్స్ సమాఖ్య 'ఫాడా' ఆందోళన వ్యక్తం చేసింది. గత ఏడాది మందగమనం కారణంగా ఎదురైన సంక్షోభంతో పోలిస్తే.. ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని అంచనా వేసింది. 2019లో మందగమనం కారణంగా డీలర్​షిప్​లలో దాదాపు 2 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయిన విషయాన్ని గుర్తు చేసింది.

ఈ విషయంపై ఇప్పుడే స్పష్టమైన అంచనాకు రాలేమని 'ఫాడా' పేర్కొంది. నెలాఖరు వరకు డీలర్లు.. అవుట్​లెట్లు, మానవ వనరులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో సర్వే ద్వారా తెలుసుకుని ఒక అవగాహనకు వస్తామని తెలిపింది. మరో నెల వరకు డిమాండ్​ పుంజుకోకపోతే మాత్రం.. ఉద్యోగాల కోత తప్పకపోవచ్చని ఫాడా అధ్యక్షుడు ఆశిశ్​ హర్షరాజ్ కాలే అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:కరోనా వేళ బంగారంపై పెట్టుబడి మంచిదేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.