ETV Bharat / business

జీవిత బీమా ప్రీమియం చెల్లింపు గడువు మరోమారు పెంపు - COVID-19

జీవిత బీమా పాలసీదారులకు మరోమారు ఉపశమనం కలిగిస్తూ ఐఆర్​డీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి, ఏప్రిల్​ నెలలకు సంబంధించి ప్రీమియం చెల్లింపు గడువును మే 31 వరకు పెంచింది. దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ఆంక్షలు పొడిగించిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Irdai
జీవిత బీమా ప్రీమియం చెల్లింపునకు గడువు మరోమారు పెంపు
author img

By

Published : May 10, 2020, 7:53 PM IST

కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ ఆంక్షలు పొడగించిన నేపథ్యంలో జీవిత బీమా పాలసీదారులకు మరోమారు ఉపశమనం కల్పించింది ఇన్యూరెన్స్​ రెగ్యులేటరీ అండ్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఐఆర్​డీఏఐ). మార్చి, ఏప్రిల్​ నెలలకు సంబంధించిన జీవిత బీమా ప్రీమియం చెల్లింపు గడువును మే 31 వరకు పొడిగించింది.

గతంలో 2 సార్లు..
మార్చి, ఏప్రిల్​ నెలలకు చెందిన ప్రీమియం చెల్లింపు గడువును 30 రోజుల పాటు పొడిగిస్తూ గతంలో మార్చి 23, ఏప్రిల్​ 4న నిర్ణయం తీసుకుంది ఐఆర్​డీఏఐ. లాక్​డౌన్​ ఆంక్షలను మే 17 వరకు పొడిగించిన క్రమంలో మరోమారు గడువు పెంచినట్లు తెలిపింది.

"కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ పరిస్థితులు, పాలసీదారుల నుంచి అందిన వినతుల మేరకు.. మార్చి 2020లో ప్రీమియం చెల్లించాల్సిన జీవిత బీమా పాలసీదారులకు గడువును మే 31 వరకు పెంచుతున్నాం. ఈ విషయాన్ని పాలసీదారులందరూ గమనించాలి. ఆన్​లైన్​లో ప్రీమియం చెల్లించేందుకు అన్ని బీమా సంస్థలు ఏర్పాట్లు చేశాయి."

- ఐఆర్​డీఏఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.