ETV Bharat / business

బీమా సంస్థలపై కొవిడ్‌ పిడుగు.. క్యూ1లో నష్టాలే! - బీమా కంపెనీలు

కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో బీమా కంపెనీలు కుదేలయ్యాయి. వైరస్ కారణంగా మరణాలు పెరగటం వల్ల.. ఆరోగ్య బీమా, జీవిత బీమా విభాగంలో క్లెయిముల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కొన్ని సంస్థలు నష్టాలు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Insurance companies
బీమా కంపెనీలపై కొవిడ్ పిడుగు
author img

By

Published : Jun 20, 2021, 7:14 AM IST

ఊహించని విధంగా విరుచుకుపడిన కొవిడ్‌-19 రెండో దశ ఎన్నో వ్యాపార రంగాలను కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టింది. ఈ జాబితాలోకి బీమా కంపెనీలు వచ్చి చేరుతున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్‌ ప్రారంభం నుంచి మే నెలాఖరు వరకు ఎంతో మంది కొవిడ్‌-19 వ్యాధి బారిన పడి తల్లడిల్లిపోయారు. దేశవ్యాప్తంగా రోజుకు నాలుగు లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఆసుపత్రుల పాలైన వారి సంఖ్యతో పాటు, ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా ఎంతో అధికంగా ఉంది. దీనివల్ల ఆరోగ్య బీమా, జీవిత బీమా విభాగంలో క్లెయిముల సంఖ్య గణనీయంగా పెరిగింది. తత్ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌- జూన్‌) లో కొన్ని బీమా కంపెనీలు నష్టాలు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి.

రూ.225- 275 కోట్ల నష్టం

కొవిడ్‌-19 వల్ల ఈ ఏడాది మే నెలలో మరణాలు అధికంగా నమోదై, ఆ మేరకు క్లెయిములు సంఖ్య పెరిగిందని కోటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఈ నెల 17న తన మాతృ సంస్థ కోటక్‌ మహీంద్రా బ్యాంకుకు నివేదించింది. జూన్‌ నెలాఖరుతో ముగిసే త్రైమాసికానికి క్లెయిముల సంఖ్య ఎంతో అధికంగా ఉంటుందని తాము అంచనా వేస్తున్నట్లు వివరించింది. అందువల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.225 కోట్ల నుంచి రూ.275 కోట్ల మేరకు నష్టం ఉండవచ్చని భావిస్తున్నట్లు వెల్లడించింది. దీనికి తగ్గట్లుగా నిధులు కేటాయించాల్సి (ప్రొవిజనింగ్‌) వస్తుందని అభిప్రాయపడింది.

5-10 రెట్లు పెరిగిన క్లెయిములు

ఈ ఏడాది ఏప్రిల్‌లో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య అధికమైంది. అధికారికంగానే 1.9 లక్షల మరణాలు నమోదయ్యాయి. దీంతో జీవిత బీమా (టర్మ్‌, ఎండోమెంట్‌, మనీబ్యాక్‌, యులిప్‌లు) క్లెయిమ్‌ల సంఖ 5 నుంచి 10 రెట్లు పెరిగినట్లు బీమా పరిశ్రమ వర్గాల కథనం. ఇంత పెద్దమొత్తంలో క్లెయిమ్‌లు పరిష్కరించాల్సి వస్తుందని జీవిత బీమా కంపెనీలు అంచనా వేయలేదు. ఆ మేరకు కేటాయింపులు కూడా చేయలేదు. దీంతో ఒక్కసారిగా బీమా కంపెనీల లాభాల మీద ఒత్తిడి పెరిగింది. ఆరోగ్య బీమా కంపెనీల విషయంలోనూ ఇదే పరిస్థితి. ఆసుపత్రుల పాలై 10-20 రోజుల పాటు కొవిడ్‌-19 చికిత్స తీసుకున్న వారి సంఖ్య ఎంతో అధికంగా ఉంది. బీమా కంపెనీలు 'క్యాష్‌లెస్‌' సదుపాయాన్ని అమలు చేయడం లేదని, రీ-ఇంబర్స్‌మెంట్‌ దరఖాస్తులను సత్వరం పరిష్కరించడం లేదన్న ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో ఐఆర్‌డీఏఐ (భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ) బీమా కంపెనీలను హెచ్చరించింది కూడా. ఇదిలా ఉంచితే, ఆరోగ్య బీమా క్లెయిములు సైతం బీమా కంపెనీలకు పెద్దఎత్తున దాఖలైనట్లు పరిశ్రమ వర్గాల విశ్లేషణ. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో నష్టాలు నమోదు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నం కావచ్చని కొన్ని కంపెనీలు అంచనా వేస్తున్నాయి.

పాలసీలు ఖరీదయ్యాయి

క్లెయిమ్‌ల సంఖ్య గణనీయంగా పెరగడంతో బీమా కంపెనీలు ఆదాయాలను పెంచుకోవడంపై దృష్టి సారించాయి. ఇందులో భాగంగా పాలసీల ప్రీమియం మొత్తాలను భారీగా పెంచుతున్నాయి. కొత్తగా జారీ చేసే టర్మ్‌ పాలసీలపై ప్రీమియాన్ని గరిష్ఠంగా 25 శాతం వరకు పెంచేశాయి. ఆరోగ్య బీమా విభాగంలో కొత్త పాలసీలతో పాటు, పునరుద్ధరణ (రెన్యువల్‌) పాలసీలపై సైతం ప్రీమియాన్ని 15 నుంచి 40 శాతం వరకు అధికం చేశాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలపై బీమా భారం పెరిగిపోయింది. అసలే ఆదాయాలు, ఉపాధి కోల్పోయిన పేద, మధ్య తరగతి ప్రజలు ప్రీమియం వాయిదాలు కట్టలేక తల్లడిల్లిపోతున్నారు. కొత్తగా పాలసీలు తీసుకోవాలనుకునే వారూ ఇబ్బంది పడుతున్నారు. కొంత మంది పాలసీలను పునరుద్ధరణ చేసుకోలేని ఇబ్బందుల్లో పడిపోయారు కూడా.

ఇదీ చదవండి : మీ ఫోన్​లో ఈ యాప్స్​ ఉన్నాయా? జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.