ETV Bharat / business

కరోనా సోకకుండా ఏటీఎంలో ఇలా చేయండి! - ఏటీఎంలలో కరోనా సోకకుండా తీసుకోవాల్సి జాగ్రత్తలు

కరోనా సోకకుండా భౌతిక దూరం పాటించడం, మాస్క్​లు ధరించడం వంటి జాగ్రత్తలకు ఇటీవల ప్రాధాన్యత పెరిగింది. అయితే మనం నిత్యం చేసే కొన్ని పనుల వల్ల కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. ఏటీఎం నుంచి నగదు విత్​డ్రా చేయడం వంటివీ ఇందులో భాగమే. ఏటీఎంకు వెళ్లినప్పుడు కరోనా సోకకుండా వ్యవహరించే విధానంపై 'ఈటీవీ భారత్​' సూచనలు, సలహాలు మీ కోసం.

precautionary measures on ATM usage
ఏటీఎంలో నగదు ఉపసంహరణకు తీసుకోవాల్సి జాగ్రత్తలు
author img

By

Published : Apr 27, 2020, 5:31 AM IST

Updated : Apr 27, 2020, 8:23 AM IST

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి. ఇది అంటు వ్యాధి కావడం వల్ల ఎవరికి? ఎలా? సంక్రమిస్తుందో చెప్పడం కష్టం. మనం తరచూ చేసే కొన్ని తప్పనిసరి పనుల వల్ల కూడా కరోనా సోకే ప్రమాదం ఉంది. అయితే వ్యక్తిగత జాగ్రత్తలతోనే కరోనాను అరికట్టగలం. ఏటీఎంలో నగదు ఉపసంహరించుకోవడం కూడా ఇందులో ముఖ్యమైనది. మరి ఏటీఎంలలో నగదు ఉపసంహరించుకునే విధానంపై 'ఈటీవీ భారత్' అందిస్తున్న సూచనలు.

జాగ్రత్తలు..

  • ఏటీఎం తలుపు తెరిచేటప్పుడు చేతులతో కాకుండా. భుజంతో తెరవడం మంచిది. ఏటీఎంలో లోపల ఏ వస్తువును చేతితో నేరుగా తాకకుండా జాగ్రత్త పడాలి.
  • ఏటీఎం పీన్​ ఎంటర్ చేసేటప్పుడు టిష్యూ పేపర్​ వాడాలి.
  • ఏటీఎం నుంచి వచ్చిన డబ్బును నేరుగా జేబులో పెట్టుకోకూడదు. నోట్లను శానిటైజ్​ చేసిన తర్వాతే జేబులో పెట్టుకోవాలి. ఏటీఎం కార్డును కూడా ఇలానే శానిటైజ్ చేయాలి.
  • వాడిపారేసిన టిష్యూలను మళ్లీ ఇతర అవసరాలకు వినియోగించకూడదు.
  • ఎటీఎంలో పని ముగిసిన తర్వాత.. చేతులను శానిటైజర్​తో శుభ్రం చేసుకోవడం మరిచిపోవద్దు.
  • నగదు లావాదేవీలు అవసరం లేదు అనుకుంటే.. డిజిటల్​ చెల్లింపులు చేయడం ఉత్తమం.

ఇదీ చూడండి:వాట్సాప్‌లో జియోమార్ట్​ సేవలు ప్రారంభం

Last Updated : Apr 27, 2020, 8:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.