ETV Bharat / business

'చివరి త్రైమాసికంలో వ్యయం 25 శాతానికి మించొద్దు' - latest economy news

ఆర్థిక మందగమనం నేపథ్యంలో ద్రవ్య లోటును పూడ్చుకునేందుకు కేంద్రం చర్యలను ప్రారంభించింది. చివరి త్రైమాసికంలో వ్యయ పరిమితి 25 శాతానికి మించకుండా బడ్జెట్ అంచనాలను రూపొందించుకోవాలని సూచించింది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం. ఈ మేరకు ఆదివారం అన్ని శాఖలకు ఆదేశాలను జారీ చేసింది.

'Cost of last quarter at econimially not exceed 25%'
'చివరి త్రైమాసికంలో వ్యయం 25 శాతానికి మించొద్దు'
author img

By

Published : Dec 31, 2019, 9:56 PM IST

2019-20 ఆర్థిక సంవత్సరంలోని జనవరి-మార్చి త్రైమాసికంలో ఆర్థిక లోటును పూడ్చుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది. అందులో భాగంగా వ్యయాన్ని కట్టడి చేయాలని నిర్ణయించింది. చివరి త్రైమాసికంలో వ్యయం 25 శాతానికి మించకుండా అంచనాలను సిద్ధం చేసుకోవాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం సూచించింది. మొదటి రెండు నెలల్లో 15శాతం.. చివరి నెల 10 శాతం ఖర్చు మించకుండా చూసుకోవాలని పేర్కొంది. ఇదివరకు అనుమతి పొందిన పనులకు బడ్జెట్ ఎక్కువ అయితే ఆ నిధుల కోసం పార్లమెంటు ఆమోదం తప్పనిసరి అని.. అన్ని శాఖల మంత్రులు, విభాగాలు ఈ మార్గ దర్శకాలను పాటించాలని ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయం తన ఆదేశాల్లో వివరించింది.

3.3 శాతం ఆర్థిక లోటు..

2017లో కూడా ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. ఆ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 33 శాతం నుంచి 15 శాతానికి వ్యయాన్ని పరిమితం చేయాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.3 శాతం ఆర్థిక లోటు ఉంది.

తగ్గిన పరోక్ష పన్ను వసూలు

పన్ను వసూలు అంచనాల కన్నా తక్కువగా ఉండటం వల్లే ఆర్థిక లోటు పెరిగినట్లు తెలుస్తోంది. స్థూల ప్రత్యక్ష పన్ను వసూలు నవంబర్ వరకు 5 శాతం పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ప్రత్యక్ష మంత్రిత్వ శాఖ 15 శాతం వృద్ధితో 13.80 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. పరోక్ష పన్ను, వస్తువులు, సేవల పన్నుల్లో ఆశించినంత పురోగతి లేకపోవడం ఆందోళన కలిగిస్తున్న అంశం. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కేంద్ర జీఎస్టీ సేకరణ 2019-20 ఏప్రిల్-నవంబర్ కాలంలో బడ్జెట్ అంచనా కన్నా దాదాపు 40 శాతం తగ్గింది. ఏప్రిల్-నవంబర్ కాలంలో బడ్జెట్​లో సీజీఎస్టీ అంచనా రూ .5,26,000 కోట్లు కాగా.. వసూలైంది మాత్రం రూ .3,28,365 కోట్లు కావడం గమనార్హం.

అంచనాల కన్నా రాబడి తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో లక్ష్యాలను చేరుకోవడం కష్టం కావడం వల్ల వ్యయ సవరణకు పూనుకుంది కేంద్రం.

Bundi (Rajasthan), Dec 31 (ANI): Bharatiya Janata Party's MLA from Rajasthan, Madan Dilawar sparked controversy while speaking on Citizenship Amendment Act (CAA). "Those who are burning the country and killing police over Citizenship Amendment Act, and those who are supporting them, are enemies of the country, be it Sonia Gandhi, Priyanka Gandhi or Rahul Gandhi," said MLA Dilawar "They do not have the right to live in this country. If they love Pakistan they should go there, if they love Bangladesh they should go there, and if both the countries don't want them, they can drown in the Indian Ocean," he added. He also hits out Chief Minister of Rajasthan Ashok Gehlot and other Congress leaders for opposing the CAA.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.