ETV Bharat / business

టీకా 'సంపద'- కొత్తగా 9మంది బిలియనీర్లు - వ్యాక్సిన్ సంస్థలకు భారీ ఆదాయం

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ టీకాకు విపరీతమైన డిమాండ్‌ నెలకొన్న వేళ ఈ టీకా ఉత్పత్తి సంస్థల అధిపతుల సంపద అమాంతం పెరుగుతోంది. తాజాగా 9 మంది అపర కుబేరుల జాబితాలో చేరారు. ఇప్పటికే ఈ జాబితాలో ఉన్న మరో 8 మంది సంపదను రికార్డు స్థాయిలో పెరిగింది.

New billionaires raised by Covid Vaccine
వ్యాక్సిన్​తో కొత్త బిలియనీర్లు
author img

By

Published : May 20, 2021, 8:17 PM IST

యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు కొన్ని ఫార్మా సంస్థలు శాస్త్రవేత్తలతో కలిసి ముమ్మర పరిశోధనలు సాగించాయి. శరవేగంగా వ్యాక్సిన్లు తయారుచేశాయి. వారి శ్రమ ఫలించి ఇప్పుడు పలు సంస్థల టీకాలు అందుబాటులోకి వచ్చాయి.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా టీకాకు ఉన్న డిమాండ్‌ కారణంగా ఆయా సంస్థలు భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. టీకా తెచ్చిన లాభాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న అపర కుబేరుల జాబితాలో 9 మంది కొత్తగా చేరారని ది పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్ కాంపెయిన్‌ గ్రూప్‌ తెలిపింది.

ఫోర్బ్స్‌ రిచ్‌ లిస్ట్‌ ఆధారంగా ఈ 9 మంది మొత్తం నికర సంపద 19.3 బిలియన్‌ డాలర్లు అని తేలింది. అంతేగాక, ఇప్పటికే బిలియనీర్ల జాబితాలో ఉన్న మరో 8 మంది సంపద టీకాలు వచ్చిన తర్వాత 32.2 బిలియన్‌ డాలర్లు పెరిగినట్లు వెల్లడైంది.

కొత్త బిలియనీర్లు..

కొత్తగా బిలియనీర్ల అయిన వారిలో మోడెర్నా సంస్థ సీఈఓ స్టీఫెన్‌ బాన్సెల్‌, బయోఎన్‌టెక్‌ వ్యవస్థాపకుడు ఉగర్‌ సహిన్‌ ముందువరుసలో ఉన్నారు. చైనా వ్యాక్సిన్‌ కంపెనీ కాన్‌సినో బయోలాజిక్స్‌ సహవ్యవస్థాపకులు ముగ్గురు కూడా బిలియనీర్ల జాబితాలో చేరారు.

'ఏకఛత్రాదిపత్యం ఆగాలి'

కొత్తగా చేరిన బిలియనీర్ల మొత్తం సంపదతో తక్కువ ఆదాయం ఉన్న దేశాల్లోని ప్రజలందరికీ 1.3 రెట్లు టీకాలు అందించొచ్చని పీపుల్స్‌ వ్యాక్సిన్‌ అలయన్స్ పేర్కొంది. టీకాలతో ఫార్మా కంపెనీలు భారీ లాభాలను సాధించాయని చెప్పేందుకు ఈ కుబేరులే నిదర్శనమని, ఇకనైనా వ్యాక్సిన్‌ టెక్నాలజీపై దిగ్గజ కార్పొరేషన్ల ఏకఛత్రాదిపత్యం ఆగాలని పిలుపునిస్తోంది.

ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్లపై పేటెంట్‌ హక్కులను తాత్కాలికంగా రద్దు చేయాలని ప్రపంచవ్యాప్తంగా అభ్యర్థనలు వెల్లువెత్తుతున్నాయి. అప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాక్సిన్ ఉత్పత్తి పెరుగుతుందని పలువురు నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.