ETV Bharat / business

కరోనా తెచ్చిన తంటా- ఉద్యోగులకు జీతాలు కష్టమే! - వ్యాపార వార్తలు

ప్రస్తుతం ఎక్కడ చూసిన కరోనా వైరస్​పైనే చర్చ. కరోనా కారణంగా సమస్త ప్రజానికం, వ్యాపార, వాణిజ్య వ్యవస్థలు అన్నింటికీ తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా దేశంలోని చాలా సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తే ప్రమాదముందని పరిశ్రమల విభాగం ఫిక్కీ ఓ సర్వేలో తెలిపింది.

corona effect on employees
ఉద్యోగులపై కరోనా ప్రభావం
author img

By

Published : Mar 21, 2020, 12:30 PM IST

Updated : Mar 21, 2020, 3:19 PM IST

కరోనావైరస్​ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తోంది. కొన్నాళ్లుగా వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో చాలా సంస్థలు ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి.

దేశీయంగా సగానికి పైగా కంపెనీల కార్యకలాపాలపై కరోనా వైరస్‌ ప్రభావం పడినట్లు ఫిక్కీ నిర్వహించిన సర్వేలో తేలింది. అది కూడా ప్రాథమిక దశలోనేనని తెలిపింది. అలాగే సుమారు 80 శాతం కంపెనీలకు నగదు లభ్యత తగ్గిందని కూడా సర్వే వెల్లడించింది. దీంతో ఉద్యోగులకు జీతాలు, వడ్డీలు, రుణాల చెల్లింపులు చేయలేని పరిస్థితి నెలకొంటోందని పేర్కొంది.

కరోనా వైరస్‌ సరఫరా, గిరాకీ రెండింటికి తీవ్ర అంతరాయాలు సృష్టించిందని, దేశ వృద్ధిపథానికి ఇది అవరోధంగా నిలుస్తుందని తెలిపింది. ఈ సంక్షోభం నుంచి వ్యాపార సంస్థలు బయటపడాలంటే.. పరపతి విధాన నిర్ణయాలతో పాటు ఆర్థికపరమైన సహకారాన్ని ప్రభుత్వం అందించాల్సిన అవసరం ఉందని సర్వే అభిప్రాయపడింది.

ఇదీ చూడండి:బీఎస్​ఎన్​ఎల్​ 'కరోనా' ఆఫర్​- నెలపాటు నెట్ ఉచితం!

Last Updated : Mar 21, 2020, 3:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.