కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఉద్యోగులు ఇంటినుంచే పనిచేసేలా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. అత్యవసర సేవలు తప్ప ప్రైవేటు రంగంలోని అన్ని సంస్థలూ ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సూచించింది. బీఎస్‌ఎన్‌ఎల్ దీనిని ఓ వ్యాపార అవకాశంగా మలుచుకుంది. కొత్తగా కనెక్షన్లు తీసుకొనే వినియోగదారులకు ఒక నెల ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందజేస్తామని ప్రకటించింది.
ప్రస్తుతం ఉన్న ల్యాండ్‌లైన్ వినియోగదారులు, కొత్త వినియోగదారులు కాపర్ కేబుల్ కనెక్షన్ తీసుకుంటే కనీస ఇన్‌స్టాలేషన్ రుసుములూ వసూలు చేయబోమని బీఎస్‌ఎన్‌ఎల్ తెలిపింది. మోడెమ్ మాత్రం కొనుగోలు చేయాలని సూచించింది.
"ప్రస్తుతం ల్యాండ్‌లైన్ కనెక్షన్ ఉన్నవారు, కొత్తగా కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి ఒకనెల ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందిస్తాం. దేశవ్యాప్తంగా దీనిని అమలు చేస్తున్నాం. ఈ పథకంతో బయటకు రాకుండా ఇంటివద్ద నుంచే వారు పనిచేసుకోవచ్చు."
- వివేక్ బంజాల్, బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్
ఒక నెల ఉచిత సేవలు పూర్తవ్వగానే రెండో నెల నుంచి వినియోగదారులు చెల్లింపు సేవలు పొందాల్సి ఉంటుంది. ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ కావాలనుకొనే వినియోగదారుల నుంచి ఇన్‌స్టాలేషన్ రుసుములు వసూలు చేస్తారు. ఒక ఫోన్‌కాల్ ద్వారా సేవలు పొందొచ్చు.
"ఇప్పుడు కనెక్షన్ ప్రక్రియనంతా పేపర్ రహితంగా మార్చేశారు. వినియోగదారులు సేవా కేంద్రానికి రానవసరం లేదు. ఫోన్ చేసి బ్రాడ్‌బ్యాండ్ సేవలు పొందొచ్చు."
- వివేక్ బంజాల్, బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్
ఇదీ చూడండి: కరోనాతో ఎయిర్ఇండియా ఉద్యోగుల జీతాల్లో కోత