ETV Bharat / business

కరోనాతో కోలుకోలేని దెబ్బ... మూతపడుతున్న హోటళ్లు

హోటళ్లు, రెస్టారెంట్లపై కరోనా తీవ్రమైన ప్రభావం చూపింది. ఒకప్పుడు రద్దీగా ఉండే హోటళ్లు ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రభుత్వం సడలింపులతో తిరిగి ప్రారంభమైన వినియోగదారులు ఆసక్తి చూపడం లేదు. ఆదాయాలు క్షీణించాయి. నిర్వహణ భారంగా మారింది. కష్టాలు, నష్టాలతో అనేక హోటళ్లు మూతపడుతున్నాయి.

corona
corona
author img

By

Published : Jun 29, 2020, 8:50 AM IST

అది హైదరాబాద్‌లోని పేరొందిన హోటల్‌.. ఒకప్పుడు కిక్కిరిసి ఉండేది. తమ వంతు కోసం భోజనప్రియులు ఎదురు చూసేవారు.. ఇప్పుడు అక్కడికి వచ్చేవారే కరవయ్యారు. బోసిపోయి దర్శనమిస్తోంది.

జాతీయ రహదారిపై ఆ హోటల్‌ వద్ద పెద్దఎత్తున లారీలు, వాహనాలు ఆగి ఉండేవి. ఇప్పుడు అక్కడ ఏ సందడీ లేదు. వాహనాల్లో అంతా చూస్తూ వెళ్తున్నారే తప్ప ఎవరూ రావడం లేదు.

రాష్ట్రంలో సేవారంగంలో మొదటిస్థానంలో ఉండే హోటళ్ల పరిశ్రమ కరోనా సంక్షోభంతో కోలుకోలేని విధంగా నష్టపోయింది. ఆదరణ తగ్గడంతో పాటు ఆదాయాలు క్షీణించాయి. నిర్వహణ భారంగా మారింది. కష్టాలు, నష్టాలతో అనేక హోటళ్లు మూతపడుతున్నాయి. రాష్ట్రంలో 37,000కి పైగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు, లాడ్జిలు, దాబాలు, మెస్‌లు, రిసార్టులు ఉన్నాయి. పెద్ద హోటళ్లను వ్యాపారులు భారీ పెట్టుబడులతో ప్రారంభించగా.. అధికశాతం అప్పులతో నిర్వహిస్తున్నారు. చిన్న హోటళ్లు, టిఫిన్‌ సెంటర్ల వంటివి నిరుద్యోగులకు, మధ్యతరగతి కుటుంబాలకు ఉపాధినందిస్తున్నాయి. వీటిలో 15 లక్షల మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారు.

కరోనా ముందు కళకళ

రాష్ట్రం వివిధ రంగాల్లో అభివృద్ధి చెందడం వల్ల పారిశ్రామికవేత్తలు, వాణిజ్య, వ్యాపార ప్రముఖులతో పాటు పర్యాటకులు పెద్దఎత్తున హాజరయ్యేవారు. ఆతిథ్య రంగానికి మంచి ఆదరణ లభించింది. పెద్ద సంఖ్యలో హోటళ్లలో బస చేయడం, భోజనాలు, పానీయాలు తీసుకోవడం వంటివి ఆదాయాలను అందించేవి. రుచికరమైన ఆహార పదార్థాలను అందించే హోటళ్లకు హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, ఖమ్మం తదితర నగరాల్లో రద్దీ ఉండేది. ఇదంతా కరోనాకు ముందు పరిస్థితి.

వైరస్‌ దెబ్బకు వెలవెల

వైరస్‌ కారణంగా మార్చిలో విధించిన లాక్‌డౌన్‌తో పరిస్థితి తలకిందులైంది. హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లు మూతపడ్డాయి. మూణ్నెల్ల పాటు తెరుచుకోలేదు. లాక్‌డౌన్‌ సమయంలో నిల్వ ఉన్న వంట దినుసులు పాడవ్వడంతో హోటల్‌ పరిశ్రమకు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లింది. వీటిలో పనిచేసే కార్మికుల్లో 60 శాతం ఇతర రాష్ట్రాల వారు కావడంతో వారికి ముందే వేతనాలను చెల్లించాల్సి వచ్చింది. తమ భవనాలకు కరెంటు బిల్లులు, ఆస్తి పన్ను, లైసెన్స్‌ రుసుము.. ఇలా అన్నీ చెల్లించక తప్పలేదు.

60 శాతం హోటళ్లే నడుస్తున్నాయ్‌

రాష్ట్ర ప్రభుత్వం హోటళ్లు తెరుచుకోవచ్చని ఈనెలలో అనుమతించింది. జనం రాకపోవడంతో నష్టాల పరంపర కొనసాగుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఆగిపోయాయి. సదస్సులు, సభలు జరగడం లేదు. హోటళ్లలో 60 శాతమే ప్రస్తుతం నడుస్తున్నాయి. టిఫిన్‌ సెంటర్లు కూడా 70 శాతం నడవడంలేదు. లాడ్జీలలో ఎవరూ చేరడం లేదు. హోటళ్లు తెరవడం వల్ల సిబ్బందికి వేతనాలతో పాటు మళ్లీ అద్దెలు, విద్యుత్‌ ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి యాజమాన్యాలకు ఏర్పడింది. భోజనాలు, ఇతర తినుబండారాలు తయారుచేసినా గిరాకీ లేక కొన్నిచోట్ల పారవేస్తున్నారు.

గతంలో మా హోటల్‌ రద్దీగా ఉండేది. చాలా మంది ఇల్లులా భావించి, భోజనాలు చేసేవారు. ఇప్పుడు 15 శాతం మంది కూడా రావడం లేదు. కనీస ఆదాయం లేదు.

- నారాయణ, హోటల్‌ యజమాని కరీంనగర్‌

ఉపాధి కోసం హోటల్‌ను ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నాం. లాక్‌డౌన్‌తో మొత్తం నష్టపోయాం. ఇప్పటికీ కోలుకోలేదు. మరికొన్ని రోజులు ఇలాగే ఉంటే నిర్వహణే కష్టం.

- సతీష్‌, ఉడిపి హోటల్‌ వనపర్తి

టేక్‌ అవే సర్వీసులపై దృష్టి

హైదరాబాద్‌ తదితర నగరాల్లో హోటళ్లకు సందర్శకులు రాకపోవడంతో భోజనాలను తయారుచేసి పార్సిళ్లను పంపడానికి టేక్‌ అవే సేవలను ప్రారంభించారు. కొన్ని పెద్ద హోటళ్లకు కొంత మేరకు ఆదాయం సమకూరుతున్నా.. చిన్న హోటళ్లకు అంతగా రద్దీ లేదు. పైగా కమీషన్‌ భారంగా మారింది.

లైసెన్స్‌ రుసుము రద్దు చేయాలి

రాష్ట్ర హోటల్‌ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆదాయాలు పూర్తిగా పడిపోయాయి. ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఆర్థికంగా ఇబ్బందులున్నందున ఏడాది పాటు వ్యాపార లైసెన్స్‌ రుసుము రద్దు చేయాలి. ఆస్తిపన్నును, విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ రుసుములను మినహాయించాలి. ప్రభుత్వం ఆదుకోకపోతే పరిశ్రమ కుప్పకూలుతుంది.

- వెంకట్‌రెడ్డి, రాష్ట్ర హోటళ్ల సంఘం అధ్యక్షుడు

ఇదీ చదవండి: హైదరాబాద్​లో మరోసారి లాక్​డౌన్​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.