ETV Bharat / business

ఇకపై గ్రూప్ పాలసీగా కరోనా కవచ్ - కరోనా కవచ్​కు గ్రూప్ పాలసీ అనుమతి

'కరోనా కవచ్'ను గ్రూప్​ పాలసీగా విక్రయించేందుకు బీమా సంస్థలకు ఐఆర్​డీఏఐ అనుమతిచ్చింది. గ్రూప్ పాలసీకి.. వ్యక్తిగత పాలసీ నిబంధనలే వర్తిస్తాయని వెల్లడించింది. ఈ పాలసీకీ ప్రీమియం నిర్ణయించే అధికారం బీమా సంస్థలకే ఇచ్చింది.

corona kavach sold as group ppolicy
కరోనా కవచ్​కు గ్రూప్ పాలసీ అనుమతి
author img

By

Published : Jul 22, 2020, 8:42 AM IST

కరోనా చికిత్సకు వర్తించేలా ఇటీవలే అందుబాటులోకి వచ్చిన కరోనా కవచ్​ పాలసీకి మరిన్ని కీలక అనుమతులు ఇచ్చింది భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ(ఐఆర్​డీఏఐ). కరోనా కవచ్​ను గ్రూప్​ ఆరోగ్య పాలసీగా విక్రయించేందుకు సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలకు అనుమతులిచ్చింది.

ఇటీవల ఇచ్చిన మార్గదర్శకాలు పాటిస్తూనే.. పాలసీ ముందు 'గ్రూప్' అని చేర్చాలని సూచించింది. వ్యక్తిగతంగా అందించే పాలసీకి వర్తించే నిబంధనలే గ్రూప్​ పాలసీకీ వర్తిస్తాయని ఐఆర్​డీఏఐ స్పష్టం చేసింది. గ్రూప్ పాలసీకి ప్రీమియం నిర్ణయించే అధికారం బీమా సంస్థలదేనని తెలిపింది.

సాధారణంగా గ్రూప్ పాలసీలను సంస్థలు, యాజమాన్యాలు తమ ఉద్యోగుల ప్రయోజనాలకోసం అందిస్తుంటాయి. జులై 10 నుంచి అందుబాటులోకి వచ్చిన కరోనా కవచ్ పాలసీని ఇప్పటి వరకు వ్యక్తిగతంగా లేదా కుటుంబం మొత్తానికి వర్తించేలా తీసుకునే వీలుంది. కనీసం రూ.50వేల నుంచి గరిష్ఠంగా రూ.5 లక్షలు వరకు ఈ పాలసీని తీసుకోవచ్చు.

ఇదీ చూడండి:ఆ వాహనాలకు ప్రత్యేకంగా స్టెప్నీ అవసరం లేదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.