ETV Bharat / business

కరోనా దెబ్బకు సంక్షోభంలో ఫండ్‌ పరిశ్రమ

కరోనా ప్రభావంతో ప్రతి వ్యాపార రంగం కుదేలవుతోంది. ఇప్పుడు మ్యూచువల్​ ఫండ్ పరిశ్రమనూ దెబ్బతీస్తోంది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆరు డెట్‌ ఫండ్‌ పథకాలను నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇతర కంపెనీలు ఇదే బాటలో సాగే అవకాశం ఉన్నందు వల్ల మదుపర్లలో ఆందోళన నెలకొంది.

corona-effect-mutual-fund-industry
సంక్షోభంలో ఫండ్‌ పరిశ్రమ!
author img

By

Published : Apr 25, 2020, 9:13 AM IST

కరోనా కారణంగా ఒక్కో రంగంపై ప్రభావం పడుతూ వస్తోంది. ఇప్పటికే విమాన, పర్యటక రంగాలపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుండగా.. తాజాగా మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమనూ అది దెబ్బతీస్తున్నట్లుంది. ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆరు డెట్‌ ఫండ్‌ పథకాలను నిలిపివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. మరి ఈ ప్రభావం కేవలం ఈ కంపెనీకే పరిమితమా? అంటే చెప్పలేని పరిస్థితి. మరి ఈ సమయంలో ఏం చేయాలన్నదానిపై మదుపర్లకు ఆందోళన ఉండడం సహజం.

అసలేమైంది

భారత్‌లోగత పాతికేళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇండియా ఆరు పథకాలను గురువారం రాత్రి నిలిపివేసింది.
అవి: 1. ఫ్రాంక్లిన్‌ ఇండియా లో డ్యూరేషన్‌ ఫండ్‌, 2. ఫ్రాంక్లిన్‌ ఇండియా డైనమిక్‌ అక్రూరల్‌ ఫండ్‌ 3.ఫ్రాంక్లిన్‌ ఇండియా క్రెడిట్‌ రిస్క్‌ ఫండ్‌ 4.ఫ్రాంక్లిన్‌ ఇండియా షార్ట్‌ టర్మ్‌ ఇన్‌కమ్‌ ప్లాన్‌, 5. ఫ్రాంక్లిన్‌ ఇండియా అల్ట్రా షార్ట్‌ బాండ్‌ ఫండ్‌ 6. ఫ్రాంక్లిన్‌ ఇండియా ఇన్‌కమ్‌ ఆపర్చునిటీస్‌ ఫండ్‌.కరోనా కారణంగా భారత్‌లో ఒక ఫండ్‌ సంస్థ ఇలా చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ఆరు పథకాల కింద రూ.25,000 కోట్లకు పైగా పెట్టుబడులున్నాయి. ఆ వివరాలు..

ఎందుకలా చేసింది?

భారత బాండ్‌ మార్కెట్లో చాలా వరకు డెట్‌ పథకాల్లోకి పెట్టుబడులు తగ్గిపోయాయి. కరోనా కారణంగా ఆ పథకాల నుంచి పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. దీంతో మేం ఈ నిర్ణయం తీసుకోకతప్పింది కాదని ఆ కంపెనీ ప్రెసిడెంట్‌ సంజయ్‌ సప్రె చెప్పుకొచ్చారు.

వాటిలో పెట్టుబడులు పెట్టిన వారి పరిస్థితి?

ఆ పథకాలను నిలిపివేసిన కారణంగా కంపెనీ తన పెట్టుబడులను అమ్మలేని పరిస్థితి. ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో ఎవరూ అందుకు ముందుకురాకపోవచ్చు. అందుకే ఈ పథకాల్లో పెరుగుతున్న పెట్టుబడుల ఉపసంహరణ(రిడెమ్షన్‌)లకు డబ్బులిచ్చే పరిస్థితి కూడా కంపెనీకి లేదు. ఈ నేపథ్యంలో ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టినవారు ఇపుడు వాటిని వెనక్కి తీసుకోలేరు. ఆ సంస్థ తన ఆస్తులు విక్రయించి.. మీకు డబ్బులిచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. డెట్‌ మార్కెట్లో పరిస్థితులు మెరుగైతే కంపెనీ ఆ పనిచేయవచ్చు. అయితే అందుకు ఎంత సమయం పడుతుందన్నది చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు. కొద్ది నెలల పాటు వేచిచూడాల్సి రావొచ్చని ఓ ఫండ్‌ మేనేజర్‌ అంచనా వేస్తున్నారు.

ఇతర పథకాల్లో పెట్టుబడులు?

ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇండియాలోని ఇతర పథకాల్లో పెట్టిన పెట్టుబడులు, ఇతర మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థల డెట్‌ ఫథకాల్లో పెట్టిన పెట్టుబడుల పరిస్థితి ఏమిటి అని చాలా మంది మదుపర్లు ఆందోళనకు గురికావొచ్చు. ఈ నేపథ్యంలో ప్రతీ పథకాన్ని జాగ్రత్తగా గమనించి నిర్ణయం తీసుకోవాలని విశ్లేషకులు అంటున్నారు. పోర్ట్‌ఫోలియోలో ఉన్న నష్టభయాన్ని మీరు భరించగలరా లేదా అన్నది ఇక్కడ కీలకమని అంటున్నారు.(ఫ్రాంక్లిన్‌ నిలిపివేసిన పథకాలు ఏఏఏ కంటే తక్కువ రేటింగ్‌ ఉన్న పత్రాల్లో పెట్టుబడులు పెట్టింది.) రానున్న రోజుల్లో డెట్‌ మార్కెట్లో ఆ నష్టభయం ఎంత పెరుగుతుందన్నది బేరీజు వేసుకోవాలని సూచిస్తున్నారు. వచ్చే కొద్ది వారాల పాటు పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తూ నిర్ణయం తీసుకోవడమే మేలైన వ్యూహమని చెబుతున్నారు.

ఏ పథకాలు మేలు

ప్రస్తుత పరిస్థితుల్లో ఓవర్‌నైట్‌ ఫండ్స్‌, లిక్విడ్‌ ఫండ్స్‌, బ్యాంకింగ్‌, పీఎస్‌యూ ఫండ్స్‌, కార్పొరేట్‌ బాండ్‌ఫండ్‌లపై దృష్టి నిలిపితే మేలని చాలా మంది మ్యూచువల్‌ ఫండ్‌ సలహాదార్లు సూచిస్తున్నారు. ఇక కొంతమందైతే మొత్తం ఫండ్‌లలో ఉన్న డబ్బంతా బ్యాంకుల్లో ఎఫ్‌డీలుగా పెడితే మంచిదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే మ్యూచువల్‌ ఫండ్‌లనేవి నాణ్యమైనవేనని అయితే.. అధిక నష్టభయం ఉన్న పథకాల నుంచి బయటకు రావొచ్చని.. మరీ అతి జాగ్రత్త ఉన్న మదుపర్లయితే ఓవర్‌నైట్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టడం మంచిది చెబుతున్నారు.

సెబీతో చర్చించాం

పథకాల నిలిపివేత విషయంలో సెబీతో దీర్ఘంగా చర్చించాం. మేం చెప్పిన కారణాన్ని సెబీ సహేతుకమైనదనే భావించింది. పథకాలను నిలిపివేయడమే ప్రస్తుత పరిస్థితుల్లో మంచి పని..సరైన ఆలోచన అని మేం భావిస్తున్నాం. ఇక భారత్‌లో మా కార్యకలాపాలకు మేం కట్టుబడి ఉంటాం. మిగతా పథకాలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. మాకు డబ్బులు వచ్చేకొద్దీ.. క్రమక్రమంగా వాయిదాల పద్ధతిలో నిలిపివేసిన పథకాలకు సంబంధించి మదుపర్లకు చెల్లింపులు చేస్తాం. ఈ పనిని వచ్చే కొద్ది నెలల్లో పూర్తి చేయగలం.

- శుక్రవారం ఇన్వెస్టర్‌ కాల్‌లో ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ గ్రూప్‌ ఎండీ వివేక్‌ కుద్వా

మదుపర్లూ.. మీ పెట్టుబడులు భద్రమే

చాలా వరకు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌లు తమ పెట్టుబడులను మంచి నాణ్యత గల షేర్లలోనే పెడుతుంటాయి. అలాంటి పథకాలకు ద్రవ్యలభ్యత బాగుంటుంది. సాధారణ కార్యకలాపాలకు ఇబ్బంది ఉండదు. ఇక పథకాలను నిలిపివేయడం అనేది కేవలం ఒక కంపెనీయే చేసింది. ఇది మిగతా వాటిపై ఎటువంటి ప్రభావాన్నీ చూపదు. డెట్‌ ఫథకాల్లోని మీ పెట్టుబడులు భద్రంగా ఉంటాయి. చాలా వరకు ఫండ్‌ కంపెనీలు తమకు ఎటువంటి రుణాలూ లేవని మాకు స్పష్టం చేశాయి కూడా. బ్యాంకింగ్‌ వ్యవస్థలో అదనంగా రూ.7 లక్షల కోట్ల ద్రవ్యలభ్యత ఉంది. ఆర్‌బీఐ మరిన్ని రేట్ల కోతలు చేపట్టవచ్చు కూడా. మొత్తం మీద బాండ్‌ మార్కెట్‌లో ద్రవ్యలభ్యతకు ఇబ్బంది ఉండదు. కాబట్టి మదుపర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకున్న మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ ఇపుడు కూడా బలంగానే ఉంది.

- యాంఫి ఛైర్మన్‌ నీలేశ్‌ షా

ఆందోళన అనవసరం

ఇది కేవలం ఒక కంపెనీలో ఎదురైన పరిస్థితి. రిటైల్‌ మదుపర్లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమ మొత్తం మీద ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ ఫండ్‌లు ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యకలాపాలు కొనసాగిస్తాయి.

- హెచ్‌డీఎఫ్‌సీ ఎమ్‌ఎఫ్‌ ఎండీ మిలింద్‌ బార్వే

- ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఎమ్‌ఎఫ్‌ సీఈఓ బాలసుబ్రమణియన్‌

సెబీ, ఆర్థిక జోక్యం చేసుకోవాలి

ఫ్రాంక్లిన్‌ తీసుకున్న నిర్ణయం ఆందోళనను రేకెత్తించింది. ఈ విషయంలో సెబీ, ఆర్థిక శాఖలు జోక్యం చేసుకుని.. మదుపర్ల ప్రయోజనాలను రక్షించాలి. లక్షలకొద్దీ మదుపర్లు కష్టపడి సంపాదించిన డబ్బును పరిరక్షించాలి. ఫ్రాంక్లిన్‌ పథకాల్లోని సమస్యను గుర్తించాలి. ఇటువంటి ఒక్క సంస్థ కారణంగా రూ.24 లక్షల కోట్ల పరిశ్రమపై విశ్వాసం సన్నగిల్లకుండా చూసుకోవాలి.

- అసోసియేషన్‌ ఆఫ్‌ నేషనల్‌ ఎక్స్ఛేంజ్‌ మెంబర్స్‌ ఆఫ్‌ ఇండియా(యాన్మి)

రంగంలోకి ఆర్‌బీఐ!

మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడుల ఉపసంహరణ(రిడెమ్షన్‌) పెరగకుండా.. ఆర్‌బీఐ ఒక ప్రత్యేక లిక్విడిటీ గవాక్షాన్ని ప్రారంభించవచ్చని ఒక ఆంగ్ల పత్రిక తన కథనంలో తెలిపింది. 2008లో ఆ తర్వాత 2013లో ఇదే తరహా పరిస్థితులను ఎదుర్కొన్న సమయంలో ఆర్‌బీఐ తెరచిన గవాక్షం తరహాలోనే ఇది ఉండొచ్చని అందులో పేర్కొంది.

‘ఏఏఏ’ రేటింగ్‌ దిగువన ఉన్న వాటితోనే సమస్య

మొత్తం కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్లో ఏఏఏ రేటింగ్‌ దిగువన 40-45 శాతం మేర పత్రాలున్నాయి. ఇందులో 20 శాతం వాటికి అసలు రేటింగే లేదు. కొవిడ్‌-19 మరింతగా విజృంభిస్తున్న ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ మరింత కాలం కొనసాగే అవకాశం ఉండడంతో ఈ రేటింగ్‌ లేని పత్రాల్లో ద్రవ్యలభ్యత సమస్యలు ఎదురుకావొచ్చు. ఏఏఏ గ్రేడ్‌ కంటే తక్కువ ఉన్న మిగతా పత్రాల్లోనూ నష్టభయం కనిపించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇది ఆయా కంపెనీల నగదు లభ్యతపైన ఆధారపడి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.

ఇదీ చూడండి: మే ఆఖరుకు 4 కోట్ల మంది చేతిలో మొబైళ్లుండవ్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.