గత నాలుగు నెలల్లో ప్రతికూల వృద్ధిని చవిచూసిన ఎనిమిది కీలక రంగాల వృద్ధి 2019 డిసెంబర్లో 1.3 శాతానికి చేరుకుంది. బొగ్గు, ఎరువులు, రిఫైనరీ ఉత్పత్తుల విస్తరణకు ఇది దోహదం చేసింది. అయితే ఈ వృద్ధి 2018 డిసెంబర్లో నమోదైన 2.1 శాతం కంటే తక్కువగా ఉంది.
2019 డిసెంబర్లో కీలక రంగాలైన బొగ్గు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ముడిచమురు, సహజవాయువు, విద్యుత్ ఉత్పత్తి మాత్రం క్షీణించాయి. అలాగే ఉక్కు, సిమెంట్ రంగాల వృద్ధిరేటు వరుసగా 1.9 శాతం, 5.5 శాతం తగ్గింది.
ఏప్రిల్-డిసెంబర్లో ప్రధాన పరిశ్రమలు 0.2 శాతం వృద్ధిని సాధించాయి. గతేడాది ఇది 4.8 శాతంగా ఉంది.
ఐసీఆర్ఏ ప్రకారం, ఈ కీలక రంగాల వృద్ధి సానుకూలంగా పెరుగినప్పటికీ, ఐఐపీ (ది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్) 2019 నవంబర్లో ఉన్న 1.8 శాతం కంటే తగ్గుతుంది. అలాగే గతేడాదితో పోల్చితే వాహన రంగం క్షీణిస్తుందని స్పష్టం చేసింది.
దేశంలోని అన్ని రంగాల ఉత్పత్తి (ది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్)లో ఈ ఎనిమిది కీలక రంగాల వాటా 40.27 శాతం ఉంటుంది.
ఇదీ చూడండి: పద్దు 2020: బడ్జెట్ సూట్కేస్ చరిత్ర తెలుసా?